Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'క్యూర్' పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల అర్హత జాబితా విడుదల.. మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

How to check names in Indiramma Illu in CURE area
Advertisement
  • క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల ప్రాథమిక అర్హుల జాబితా విడుదల
  • మొత్తం 7,340 ఇళ్లకు 60,720 దరఖాస్తులు
  • అర్హత, అనర్హత స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చూసుకునే వీలు
  • అభ్యంతరాల స్వీకరణకు ఆగస్టు 23 సాయంత్రం వరకు గడువు
Advertisement
'క్యూర్' ఏరియా పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక అర్హుల జాబితాను విడుదల చేసింది. ఈ పథకం కింద మొత్తం 7,340 ఇళ్లను కేటాయించాల్సి ఉండగా, ప్రభుత్వం వద్దకు 60,720 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుదారుల ఆస్తులు, వాహనాలు, సొంత ఇల్లు వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, ప్రాథమికంగా సుమారు 40,000 మందిని అర్హులుగా గుర్తించారు. దరఖాస్తుదారులు తమ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు.

దరఖాస్తుదారులు తమ స్టేటస్‌ను చెక్ చేసుకునేందుకు tghb.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ అప్లికేషన్ నంబర్, మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఆప్షన్‌ను ఎంచుకుని, సంబంధిత వివరాలు ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. దీంతో మీ అప్లికేషన్ నంబర్, పేరు, ప్రాజెక్ట్ లొకాలిటీ, స్టేటస్ వంటి వివరాలు కనిపిస్తాయి.

ఒకవేళ మీ స్టేటస్ 'అనర్హులు' అని చూపిస్తే, దాని పక్కనే ఉన్న 'రెయిజ్ క్లెయిమ్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఎందుకు అనర్హులుగా ప్రకటించారో కారణం అక్కడ కనిపిస్తుంది. ఆ కారణం సరైంది కాదని భావిస్తే, అక్కడే మీ అభ్యంతరాన్ని తెలిపి, దానికి సంబంధించిన ఆధారాలను అప్‌లోడ్ చేయవచ్చు.

అభ్యంతరాలు, క్లెయిమ్‌లను ఆగస్టు 23వ తేదీ సాయంత్రం లోపు సమర్పించాలి. తుది అర్హుల జాబితాను ఆగస్టు 25న ప్రకటించి, ఆగస్టు 27 నుంచి 30 వరకు లాటరీ ద్వారా ఇళ్లను కేటాయిస్తారు. ఏవైనా సందేహాలుంటే 040-24603572 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement
Indiramma Illu
Cure
Hyderabad

More Telugu News