భారత మార్కెట్లోకి మోటో ప్యాడ్ 70.. భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ!

08-08-2026 Sat 21:17 | Technology
Advertisement
  • భారత్‌లో మోటో ప్యాడ్ 70 టాబ్లెట్‌ను విడుదల చేసిన మోటోరోలా
  • 12.1 అంగుళాల 2.5K డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్
  • బాక్సులోనే మోటో పెన్ స్టైలస్, 68W ఫాస్ట్ చార్జర్
  • 10,200 mAh భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్
  • ఆగస్టు 15 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఇతర స్టోర్లలో అమ్మకాలు ప్రారంభం
Advertisement
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ మోటోరోలా, భారత మార్కెట్లో తన టాబ్లెట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. తాజాగా 'మోటో ప్యాడ్ 70' పేరుతో ఓ సరికొత్త టాబ్లెట్‌ను శనివారం అధికారికంగా విడుదల చేసింది. 12.1 అంగుళాల భారీ డిస్‌ప్లే, శక్తివంతమైన బ్యాటరీ, ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ట్యాబ్‌ను వినియోగదారుల ముందుకు తెచ్చింది. ప్రత్యేకంగా ఈ టాబ్లెట్ కొనుగోలు చేసిన వారికి బాక్సులోనే 'మోటో పెన్ స్టైలస్'‌ను కూడా ఉచితంగా అందిస్తుండటం విశేషం.

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, మోటో ప్యాడ్ 70లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 12.1 అంగుళాల 2.5K డిస్‌ప్లేను అమర్చారు. ఇది 800 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ట్యాబ్‌లో 8 GB ర్యామ్, 256 GB వరకు అంతర్గత స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2 TB వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. 10,200 mAh భారీ బ్యాటరీతో పాటు బాక్సులోనే 68W ఫాస్ట్ చార్జర్‌ను కూడా అందిస్తున్నారు.

వినోదం కోసం డాల్బీ అట్మోస్, హై-రిజల్యూషన్ ఆడియో ట్యూనింగ్‌తో కూడిన నాలుగు స్పీకర్లను పొందుపరిచారు. ఫొటోలు, వీడియోల కోసం వెనుక వైపు 13 MP, సెల్ఫీల కోసం ముందు వైపు 8 MP కెమెరా ఉంది. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుండగా, భవిష్యత్తులో ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్‌తో పాటు మూడేళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచ్‌లు అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. మోటొరోలా స్మార్ట్ కనెక్ట్ ఫీచర్‌తో ఇతర ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు.

ప్యాంటోన్ టైటాన్ సీ ఏంజెల్ అనే ప్రత్యేకమైన రంగులో లభించే ఈ మోటో ప్యాడ్ 70 ధరను రూ.33,999గా నిర్ణయించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్ సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రిటైల్ స్టోర్లలో దీని అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Advertisement
Moto Pad 70Motorola Tablet IndiaMoto Pad 70 SpecificationsMoto Pen StylusMotorola New LaunchMoto Pad 70 Price India

More Telugu News

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more