జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అరెస్ట్

High tension in Jammalamadugu YSRCP MLC Ramasubba Reddy arrested
  • జమ్మలమడుగులో వైసీపీ నిరసన దీక్ష
  • దీక్షకు అనుమతి లేదంటూ పోలీసుల నోటీసులు
  • దీక్షా శిబిరానికి చేరుకున్న రామసుబ్బారెడ్డిని అడ్డుకున్న పోలీసులు

డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నిరసన దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ చేపట్టిన నిరసన దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దీక్షా శిబిరానికి చేరుకోవడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. 


ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఆయన భార్య ఇందిరమ్మతో పాటు అక్కడికి చేరుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ అక్కడి నుంచి తరలించారు. ఈ సమయంలో పోలీసులకు, వైకాపా శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరగడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ప్రస్తుతం అక్కడ భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

Advertisement
Ramasubba Reddy
YSRCP
Jammalamadugu
Kadapa
DSC Protest
MLC Arrest

More Telugu News