Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్... నెటిజన్లను కన్ఫ్యూజ్ చేసిన వింత ఫోటో!

Pre wedding photoshoot strange photo confuses netizens
Advertisement
  • బాలిలో తీసిన ఓ ప్రీ-వెడ్డింగ్ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్
  • ఫోటోలో జంట పైన గాలిలో వేలాడుతున్నట్లు కనిపిస్తున్న కాళ్లు
  • తొలుత భయపడిన నెటిజన్లు... రకరకాల కామెంట్లతో చర్చ
  • ఇది కేవలం కెమెరా యాంగిల్ వల్లే జరిగిందని పలువురి విశ్లేషణ
Advertisement
ఇంటర్నెట్‌లో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. తాజాగా, ఓ జంటకు సంబంధించిన ప్రీ-వెడ్డింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలికి చెందిన 'లెమూరియార్ట్స్' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఈ ఫోటోను పోస్ట్ చేయగా, అది చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు. ఆ ఫోటోలో ఉన్న వింత చూసి, అసలేం జరిగిందోనని తలలు పట్టుకుంటున్నారు.

టెడ్డీ, స్టెఫానీ అనే జంట తమ ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ చేయించుకున్నారు. అందులోని ఓ ఫోటోలో వారిద్దరూ ప్రకృతి నడుమ నడుస్తూ రొమాంటిక్‌గా కనిపిస్తారు. అయితే, ఫోటో పైభాగంలో చూసినప్పుడే అసలు మిస్టరీ బయటపడింది. అక్కడ గాలిలో వేలాడుతున్నట్లుగా ఓ జత కాళ్లు కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. "అక్కడ ఎవరో వేలాడుతున్నట్టున్నారు" అని ఒకరు కామెంట్ చేయగా, "మొదట ఆ ఫ్రేమ్ చూడగానే భయమేసింది" అని మరొకరు రాసుకొచ్చారు.

ఈ ఫోటో ఇన్‌స్టాగ్రామ్ నుంచి 'ఎక్స్' కు చేరడంతో మరింత వైరల్‌గా మారింది. "ఒకే ఫోటోగ్రాఫర్, రెండు జానర్లు. కింద రొమాన్స్, పైన హారర్" అంటూ ఓ యూజర్ చమత్కరించారు. "ఇది సినిమాటిక్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌కి, ప్రమాదవశాత్తు తీసిన క్రైమ్ సీన్ ఫోటోకి మధ్య ఉన్న సన్నని గీతలా ఉంది" అని మరో యూజర్ కామెంట్ చేశారు.

అయితే, ఈ మిస్టరీపై చాలామంది తమదైన విశ్లేషణలు ఇచ్చారు. ఫోటోను జాగ్రత్తగా పరిశీలించిన కొందరు, ఇది కేవలం ఆప్టికల్ ఇల్యూజన్ (దృష్టి భ్రాంతి) అని తేల్చారు. ఫోటో తీస్తున్న కెమెరాకు ముందు భాగంలో ఓ వ్యక్తి నిచ్చెనపై నిలబడి ఉండవచ్చని, కెమెరా యాంగిల్ కారణంగా ఆ వ్యక్తి కాళ్లు గాల్లో వేలాడుతున్నట్లు భ్రమ కలుగుతోందని వివరించారు. ఈ వివరణతో చాలామంది ఏకీభవించారు. ఏదేమైనా, ఈ ఒక్క ఫోటో వేలాది మందిని ఒక్క క్షణం ఆలోచింపజేసి, ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Advertisement
Advertisement
Teddy and Stephanie
Bali pre wedding photoshoot
Viral optical illusion photo
Lemuriarts Instagram
Hanging legs mystery photo
Social media viral news

More Telugu News