తెలంగాణలో కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్.. వేలాదిగా పేరుకుపోయిన దరఖాస్తులు

30-07-2026 Thu 16:43 | Telangana
Advertisement
  • తెలంగాణలో పేరుకుపోతున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ దరఖాస్తులు
  • రెండు రోజుల్లో జారీ చేయాలన్న నిబంధన అమలు కాని వైనం
  • రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో 50,000కు పైగా దరఖాస్తులు
Advertisement
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్ (ఎఫ్ఆర్‌సీ) జారీ ప్రక్రియలో జాప్యం నెలకొంది. దరఖాస్తు చేసుకున్న రెండు పనిదినాల్లోనే ధ్రవీకరణ పత్రం అందజేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో గడువు పాటించకపోవడంతో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి.

ఈ పథకం ప్రారంభమైన జులై 27 నుంచి బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల ద్వారా 50 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. తొలిరోజే దరఖాస్తు చేసుకున్న వారికి సైతం ఇప్పటివరకు సర్టిఫికెట్లు అందకపోవడంతో, వారు నిత్యం మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

గత నెల 25న విడుదల చేసిన జీవో 172 నిబంధనల ప్రకారం, దరఖాస్తు అందిన రెండు పనిదినాల్లోగా సంబంధిత తహశీల్దార్లు వాటిని పరిశీలించి సర్టిఫికెట్లను జారీ చేయాలి. అయితే, పలు ప్రాంతాల్లో ఈ నిబంధన అమలు కావడం లేదు.

సర్టిఫికెట్ జారీ ప్రక్రియ ఇదే

పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న రేషన్ కార్డుల సమాచారం ఆధారంగా ప్రభుత్వం 'తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్'ను సిద్ధం చేసింది. పౌరులు మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోగానే, ఆ దరఖాస్తు నేరుగా సంబంధిత తహశీల్దార్ లాగిన్‌లోకి వెళ్తుంది. అక్కడ తహశీల్దార్ ఆ వివరాలను రేషన్ కార్డు డేటాతో సరిపోల్చి చూసి, అంతా సక్రమంగా ఉంటే డిజిటల్ సంతకంతో ధ్రవీకరణ పత్రాన్ని జారీ చేయాలి. కానీ, తహశీల్దార్ల స్థాయిలో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పేరుకుపోతోంది.
Advertisement
Telangana GovernmentFamily Register CertificateFRC Application StatusMeeseva Telangana

More Telugu News

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more