కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో అంబటి రాంబాబుపై కేసు నమోదు

16-07-2026 Thu 11:20 | Andhra
Advertisement
  • ముద్రగడ అంత్యక్రియల వేళ ఉద్రిక్తత
  • పోలీసుల గార్డ్ ఆఫ్ ఆనర్ ను అడ్డుకున్న అంబటి
  • పోలీసుల విధులను అడ్డుకున్నారంటూ కేసు నమోదు
Advertisement

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ చోటుచేసుకున్న హైడ్రామా తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడమే కాకుండా... మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుపై కేసు నమోదుకు కారణమైంది. కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో అంబటితో పాటు మరికొందరు వైసీపీ నేతలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.


ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, ముద్రగడ కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించారు. తమ కుటుంబ నిర్ణయం మేరకే సాధారణ పద్ధతిలో అంత్యక్రియలు జరగాలని వారు స్పష్టం చేశారు.


కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్య... అంత్యక్రియల వద్ద పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించేందుకు ప్రయత్నించగా, అక్కడ ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులను అడ్డుకున్నారు.


ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకోగా... విధుల్లో ఉన్న ఏఆర్ ఎస్సై అప్పలరాజు, తోటి కానిస్టేబుళ్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తాము విధి నిర్వహణలో భాగంగా గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుండగా అంబటి రాంబాబుతో పాటు మరికొందరు నేతలు తమను వెనక్కి నెట్టివేసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కిర్లంపూడి పోలీసులు అంబటి రాంబాబుపై BNS 132, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Ambati RambabuMudragada PadmanabhamKirlampudi Police StationCase RegisteredGuard of HonorYSRCP Leaders

More Telugu News

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more