Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడో పెళ్లిపై విమర్శలు.. ఆమిర్‌ఖాన్ ఏడ్చాడన్న ఆప్తమిత్రుడు అమీన్ హాజీ

Criticism over third marriage Aamir Khan felt hurt and cried says close friend Amin Hajee
Advertisement
  • ట్రోలింగ్‌పై స్పందించిన ఆమిర్ ఫ్రెండ్ అమీన్ హాజీ
  • గతంలో బంధాలు తెగిపోతే అమీర్ ఏడ్చాడడన్న స్నేహితుడు
  • పాత కుటుంబాల పట్ల ఎంతో బాధ్యత ఉంటాడని వ్యాఖ్య
  •  మాజీ భార్యలు రాకపోవడంపై స్పష్టత
Advertisement
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ ఇటీవల గౌరీ స్ప్రాట్‌ను మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి జరిగినప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమిర్ ఖాన్‌కు అత్యంత ఆప్తమిత్రుడు, దర్శకుడు అయిన అమీన్ హాజీ ఆయనకు మద్దతుగా నిలిచారు. 35 సంవత్సరాలుగా ఆమిర్‌తో ఉన్న పరిచయం ఉన్న కారణంగా  ఆయన వ్యక్తిగత జీవితంపై బయటి వారు చేస్తున్న వ్యాఖ్యలను అమీన్ హాజీ ఖండించారు.

బంధాల విచ్ఛేదంపై ఆమిర్ ఏడ్చాడు
ఒక ఇంటర్వ్యూలో అమీన్ హాజీ మాట్లాడుతూ.. ఆమిర్ ఖాన్ బంధాలకు ఎంతో గౌరవం ఇచ్చే వ్యక్తి అని కొనియాడారు. గతంలో వివాహ బంధాలు విఫలమైనప్పుడు ఆమిర్ తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడని, ఎంతో బాధపడుతూ ఏడ్చాడని ఆయన గుర్తుచేసుకున్నారు. బయటి వారు చాలా సులభంగా విమర్శలు చేస్తుంటారని, కానీ ఆమిర్ తన పూర్వ కుటుంబాల పట్ల, పిల్లల పట్ల ఎంత బాధ్యతాయుతంగా నడుచుకున్నాడో ఎవరికీ తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ముందుకు సాగిన ప్రతిసారీ పాత బంధాలకు న్యాయం చేస్తూనే ఆమిర్ ఈ నిర్ణయాలు తీసుకున్నాడని స్పష్టం చేశారు.

 పెళ్లికి మాజీ భార్యలు రాకపోవడానికి కారణం ఇదే
ఈ వివాహ వేడుకకు ఆమిర్ ఖాన్ పూర్వ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావులు హాజరుకాకపోవడంపై కూడా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దీనిపై అమీన్ హాజీ స్పందిస్తూ, ఆ సమయంలో కిరణ్ రావు బ్రిటన్ పర్యటనలో ఉన్నారని, అందుకే ఆమె కుమారుడు ఆజాద్ మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యాడని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఒకరికొకరు వ్యక్తిగత స్థానాన్ని ఇవ్వడం కూడా పరస్పర గౌరవానికి నిదర్శనమని, అంతేకాని వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇప్పటికీ అందరూ ఒకే కుటుంబంలా ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగిస్తున్నారని ఆయన వివరించారు.
Advertisement
Advertisement
Aamir Khan
Gauri Spratt
Amin Hajee
Aamir Khan third marriage
Kiran Rao
Bollywood news

More Telugu News