ఎట్టకేలకు గెలుపు బాట పట్టిన టీమిండియా.. తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై ఘన విజయం!

14-07-2026 Tue 23:24 | Sports
Advertisement
  • తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై 6 వికెట్ల తేడాతో భారత్ విజయం
  • ఓటముల పరంపరకు ముగింపు పలికిన టీమిండియా
  • శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలు
  • ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌కు నాలుగు వికెట్లు, అజేయ అర్ధశతకం
  • మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన భారత్
Advertisement
ఇటీవల ఐర్లాండ్‌తో టీ20ల్లో ఓటమి, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో 0-4 తేడాతో వైట్‌వాష్ ఎదుర్కొని తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న టీమిండియా ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు అద్భుత ప్రదర్శనతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (80 రిటైర్డ్ హర్ట్) అద్భుత అర్ధశతకంతో శుభారంభం అందించాడు. అయితే, రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (5) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. శ్రేయస్ అయ్యర్ (35)తో కలిసి గిల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 

కానీ కీలక సమయంలో గిల్ గాయంతో మైదానం వీడటం, ఆ తర్వాత అయ్యర్, కేఎల్ రాహుల్ (1) వెంటవెంటనే ఔటవడంతో భారత్ 160 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట దశలో అద్భుతంగా ఆడిన ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్), అక్షర్ పటేల్ (57 నాటౌట్) అజేయమైన ఐదో వికెట్‌కు 102 పరుగులు జోడించి మరో 28 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి ఒక దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను జో రూట్ (76 నాటౌట్), లియామ్ డాసన్ (68) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే కార్డిఫ్ లో జులై 16న జరగనుంది. 
Advertisement
Team IndiaAxar PatelWashington SundarIndia vs England 1st ODIShubman GillBirmingham Cricket

More Telugu News

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more