01 Thu 11:58 రికార్డు స్థాయిలో కిమ్ పర్యటనలు.. దశాబ్దంలో ఎన్నడూ లేనంతగా బహిరంగ కార్యక్రమాలు ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 92 సార్లు బహిరంగంగా కనిపించిన కిమ్ జాంగ్ ఉన్ 2014 తర్వాత ఇదే అత్యధికం.. గతేడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు అధికారంలోకి వచ్చాక అత్యధికంగా సైనిక కార్యక్రమాల్లో పాల్గొన్న కిమ్ తండ్రితో పాటు 19 సార్లు కనిపించిన కుమార్తె జు ఏ.. వారసత్వంపై చర్చ కుమార్తె పర్యటనలపై అప్పుడే ఓ అంచనాకు రాలేమన్న నిపుణులు
02 Thu 11:54 రైలులో హనీమూన్ డెకరేషన్.. టీసీపై వేటు, డెకరేటర్‌పై కేసు! నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్ ఏసీలో హనీమూన్ డెకరేషన్ పై రైల్వే శాఖ విచారణ అనుమతి లేకుండా బోగీలోకి ప్రవేశించారంటూ డెకరేటర్‌పై కేసు నమోదు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ భద్రతాపరమైన లోపంగా పరిగణించి శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశం
03 Thu 11:50 ఖమేనీ నివాసంపై దాడి.. తొలిసారి వీడియో విడుదల ఫిబ్రవరి 28న ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్-అమెరికా దాడి దాడిలో ఖమేనీ సహా కుటుంబ సభ్యుల మృతి ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా 35 సెకన్ల వీడియో విడుదల చేసిన ఇరాన్ నివాసం తీవ్రంగా ధ్వంసనమైనట్లు వీడియోలో దృశ్యాలు
04 Thu 11:44 మెస్సీ, రొనాల్డో అద్భుతమే.. కానీ 40 ఏళ్లకే అథ్లెట్లు ఎందుకు రిటైరవుతారు? మెస్సీ, రొనాల్డోలు వయసును జయిస్తున్నా.. అథ్లెట్ల రిటైర్మెంట్‌పై చర్చ 40 ఏళ్లకే క్రీడాకారులు రిటైర్ కావడానికి శారీరక మార్పులే కారణం 35 ఏళ్ల నుంచే కండరాల క్షీణత, శక్తి తగ్గడం మొదలవుతుందంటున్న నిపుణులు వయసు పెరిగే కొద్దీ గాయాల నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది అనుభవం ఉన్నా.. జీవశాస్త్ర నియమాలను అధిగమించడం అసాధ్యం
05 Thu 11:29 చమురు షాక్ ప్రభావం స్వల్పమే.. భారత ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ ధీమా భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందన్న ఐఎంఎఫ్ దేశీయ డిమాండ్ బలంగా ఉండడమే కారణమని విశ్లేషణ దేశ ఆర్థిక సూచీలన్నీ నిలకడగా ఉన్నాయని వెల్లడి 2026 వృద్ధి అంచనాలను స్వల్పంగా సవరించిన ఐఎంఎఫ్ 2027లో మళ్లీ పుంజుకుంటుందని వెల్లడి
06 Thu 10:48 కియా ఈవీ హబ్, విశాఖలో ఎక్స్‌పోర్ట్ సెంటర్.. కొరియాలో మంత్రి లోకేశ్ కీలక భేటీలు ఏపీలో ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని విస్తరించాలని కియాకు లోకేశ్ ప్రతిపాదన విశాఖ పోర్టు సమీపంలో ఎక్స్‌పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి కొరియన్ పెట్టుబడిదారులకు 3S విధానంతో రక్షణ కవచంలా ఉంటామని భరోసా ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్, జాయింట్ ట్రెయినింగ్ అకాడమీల ఏర్పాటుకు సంసిద్ధత ఏపీ-కొరియా ఇన్వెస్ట్‌మెంట్ డెస్క్ ఏర్పాటు చేయాలని విదేశాంగ శాఖకు సూచన
07 Thu 10:44 తిరుమల సమాచారం.. సర్వదర్శనానికి 18 గంటల సమయం దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులు భక్తులతో నిండిపోయిన క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,172 మంది భక్తులు
08 Thu 10:43 రెండు భాషలు నేర్పితే పిల్లలు అయోమయానికి గురవుతారా? డాక్టర్లు చెబుతోందిదే..! రెండు భాషల్లో మాట్లాడిస్తే పిల్లలు గందరగోళానికి గురవుతారనేది అపోహ దీనివల్ల మాటలు రావడం ఆలస్యం కాదంటున్న నిపుణులు భాషా నైపుణ్యాల అభివృద్ధిపైనా ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టీకరణ పైగా దృష్టి కేంద్రీకరణ, జ్ఞాపకశక్తి వంటి మేధో సామర్థ్యాలు మెరుగుపడే అవకాశం
09 Thu 10:40 బాలికపై అత్యాచారం.. జీవిత ఖైదు విధించిన ఏలూరు పోక్సో కోర్టు మైనర్‌పై లైంగిక దాడి, హత్యాయత్నం కేసులో నిందితుడికి జీవిత ఖైదు నిందితుడు వడ్లమూడి బాలకృష్ణకు రూ.35,000 జరిమానా 2015లో ద్వారకా తిరుమల మండలంలో జరిగిన దారుణ ఘటన
10 Thu 10:33 నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు భూ హక్కుల పండుగ 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాల పంపిణీ 22-ఏ నిషేధిత జాబితా నుంచి 2074 ఎకరాలకు విముక్తి కల్పిస్తూ ఉత్తర్వులు చుక్కల భూముల సమస్యకు కూడా పరిష్కారం చూపుతున్న ప్రజా ప్రభుత్వం దశాబ్దాలుగా నలుగుతున్న రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం