Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బెంగళూరు ఇస్రో కేంద్రానికి బాంబు బెదిరింపు కలకలం

ISRO Bengaluru headquarters receives bomb threat
Advertisement
  • బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు
  • చైర్మన్ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అందిన సందేశం
  • రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, ప్రాంగణంలో క్షుణ్ణ తనిఖీలు
  • తనిఖీల్లో ఏమీ లభ్యం కాలేదని, ఉత్తుత్తిదేనని ప్రకటన
  • ఈమెయిల్ మూలాలపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
Advertisement
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రధాన కార్యాలయంలో గురువారం బాంబు బెదిరింపు కలకలం రేపింది. బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి ఈమెయిల్ ద్వారా వచ్చిన ఈ బెదిరింపు నకిలీదని పోలీసులు నిర్ధారించారు. దీంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

ఇస్రో కేంద్రంలోని చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ కార్యాలయానికి ఈ బెదిరింపు మెయిల్ అందింది. వెంటనే అప్రమత్తమైన ఇస్రో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా ప్రాంగణాన్ని ఖాళీ చేయించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ లభ్యం కాలేదని అధికారులు స్పష్టం చేశారు.

బాంబు బెదిరింపుపై పోలీసులు కేసు నమోదు చేసి, ఈ-మెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఇస్రో కార్యాలయంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల దేశంలోని పలు కీలక సంస్థలకు ఇలాంటి నకిలీ బెదిరింపులు వస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. జూన్ 29న ఎన్‌ఐఏ, డీఆర్‌డీఓ వంటి సంస్థలకు బెదిరింపు ఈ-మెయిళ్లు పంపిన కేసులో ఢిల్లీ పోలీసులు ఘజియాబాద్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement
ISRO
Bengaluru
Bomb Threat
Hoax Email
Indian Space Research Organisation
ISRO Chairman

More Telugu News