సొంత భార్యపైనే 20 ఏళ్లుగా దారుణం.. 13 మంది కామాంధుల పేర్లు వెల్లడించిన బ్రిటన్ కోర్టు

Greater Manchester Husband Cruelty Against Wife For 20 Years Britain Court Reveals Names Of 13 Men
  • భార్యపై దారుణానికి ఒడిగట్టిన భర్త
  • మత్తు ఇచ్చి పరపురుషులతో కలిసి లైంగ దాడి
  • నిందితుల వివరాలు వెల్లడించిన కోర్టు
  • సెప్టెంబరులో తుది విచారణ ప్రారంభం 
భార్యకు మత్తుమందు ఇచ్చి, రెండు దశాబ్దాలుగా అనేకమంది పురుషులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడో భర్త. బ్రిటన్‌లో జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగు చూసింది. గ్రేటర్ మాంచెస్టర్‌కు చెందిన అరవై ఏళ్ల పైబడిన వృద్ధుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇతరుల పేర్లను వెల్లడించకుండా గతంలో ఉన్న ఆంక్షలను కోర్టు తొలగించడంతో ఈ ఉదంతం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

ప్రధాన నిందితుడైన భర్త గుర్తింపును, బాధితురాలైన అతడి భార్య భద్రత, గోప్యత నిమిత్తం చట్టప్రకారం గోప్యంగా ఉంచారు. అయితే, అతడు తన భార్యపై జరిగిన 15 లైంగిక నేరాలకు సంబంధించి ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. ఇందులో ఐదు అత్యాచారాలు, మూడు లైంగిక వేధింపులు, ఆరు దారుణమైన దాడులు, భార్య అనుమతి లేకుండా ప్రైవేట్ చిత్రాలను ఇతరులతో పంచుకున్న నేరాలు ఉన్నాయి. మిగిలిన 33 ఆరోపణలను అతడు తోసిపుచ్చాడు. 2004 నుండి గత ఏడాది అతడు అరెస్ట్ అయ్యే వరకు ఈ ఘోరాలు సాగాయని, భార్య స్పృహలో లేని సమయంలో సహ నిందితులను పిలిపించి ఈ దాడులకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది.

బయటపడ్డ నిందితుల పేర్లు
నిందితుల వివరాల వెల్లడిపై ఉన్న ఆంక్షలను కోర్టు ఎత్తివేయడంతో, 28 నుండి 73 ఏళ్ల వయసున్న 13 మంది సహ నిందితుల పేర్లు ఇప్పుడు బహిరంగమయ్యాయి. వీరిపై ఉమ్మడి కుట్ర, సామూహిక దాడులకు పాల్పడటం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ఈ దారుణాల్లో నేరుగా పాల్గొనగా, మరికొందరు ఇంటర్నెట్ వేదికగా ఈ అకృత్యాలను ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

నిందితులు వీరే..
కీత్ ఫోథరింగ్‌హామ్ (59): డండీకి చెందిన ల్యాబ్ టెక్నీషియన్. ఇతను ఇప్పటికే తన నేరాలను అంగీకరించి ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
జోనాథన్ కిర్క్ (43):  స్టాక్‌పోర్ట్‌కు చెందిన సీనియర్ పారామెడిక్ (అత్యవసర వైద్య సిబ్బంది)
ఫిలిప్ వైల్డ్ (58):        స్టాక్‌పోర్ట్‌కు చెందిన ఒక టాక్సీ డ్రైవర్
జోర్డాన్ వాలెస్ (31):  మాంచెస్టర్‌కు చెందిన డాగ్ వాకర్
అలన్ కీలాన్ (42):    మాంచెస్టర్‌కు చెందిన జూనియర్ ఫుట్‌బాల్ కోచ్
రాబర్ట్ స్టెవర్ట్ (70):     స్టాక్‌పోర్ట్‌కు చెందిన డీజే
మహమ్మద్ సాబిర్ (28): ఉద్యోగ నియామకాల సంస్థకు చెందిన వ్యక్తి 
 గ్రహం బ్రూగమ్ (73):  చెషైర్‌కు చెందిన వృద్ధుడు 

 వీరితో పాటు రిచర్డ్ టౌన్‌సెండ్, కార్ల్ లిండ్సే (టాంటన్ టౌన్ ఫుట్‌బాల్ క్లబ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్), డేవిడ్ గ్రేవ్స్, డానియల్ రేనర్ తదితరులు ఉన్నారు.

 నిందితులలో చాలామంది తమపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు. ప్రస్తుతం వీరిలో ఐదుగురికి బెయిల్ లభించగా, మిగిలిన వారు పోలీసు కస్టడీలోనే ఉన్నారు. ప్రధాన నిందితుడితో పాటు ఈ 12 మంది సహ నిందితులకు మాంచెస్టర్‌లోని మిన్షుల్ స్ట్రీట్ క్రౌన్ కోర్టులో సెప్టెంబరులో తుది విచారణ జరగనుంది.

బాధితురాలి రక్షణకు బ్రిటన్ అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. న్యాయ ప్రక్రియ సజావుగా సాగుతున్న తరుణంలో, సమాజంలో ఇటువంటి నేరాలపై అవగాహన పెంచేందుకు కోర్టు ఈ ఆంక్షలను సడలించింది. సుదీర్ఘకాలం పాటు సాగిన ఇటువంటి క్రూరమైన లైంగిక నేరాల నెట్‌వర్క్‌లను ఛేదించడంలో ఈ కేసు దర్యాప్తు అత్యంత కీలకమైనదిగా మారింది.
Greater Manchester Husband
UK Rape Case
13 Accomplices Named
British Court Verdict
Sexual Abuse Investigation
Manchester News

More Telugu News