‘గోల్డ్ మ్యాన్’ సూర్యాభాయ్ అరెస్ట్
- తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటూ వసూళ్లు
- దాదాపు రూ. 32 లక్షలు సమర్పించుకున్న బాధితులు
- డబ్బులు అడిగిన బాధితులపైనే కేసు
- హైదరాబాద్ నుంచి పారిపోతుండగా షాద్‌నగర్ వద్ద అదుపులోకి
దీంతో సెటిల్‌మెంట్ కింద కొందరికి రూ. 10 లక్షల విలువైన మూడు ఐఫోన్లు, రూ. 20 లక్షల చెక్కు ఇచ్చిన సూర్యాభాయ్.. ఆ తర్వాత మాట మార్చాడు. బాధితులే తనను బెదిరించి ఫోన్లు దొంగిలించారంటూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో సూర్యాభాయ్ చేసిన మోసం వెలుగుచూసింది. దీంతో ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసు నమోదైందని తెలుసుకుని హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన సూర్యాభాయ్‌ను పోలీసులు షాద్‌నగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
భారీ బంగారు చైన్లు, గాజులు వేసుకుంటూ సోషల్ మీడియాలో, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ సెలబ్రిటీలా తిరగడం సూర్యాభాయ్‌కు అలవాటు. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు అతడి లైఫ్‌స్టైల్‌పై నిఘా పెట్టడంతో అతడు ధరించే నగల్లో చాలా వరకు రోల్డ్ గోల్డ్ (గిల్ట్ నగలు) అని తేలింది.