చేతులు వేయడం, చనువు తీసుకోవడం ఇండస్ట్రీలో ప్రతి స్టేజ్‌లోనూ ఉంది: సింగర్ సునీత

Sunitha says touching and taking liberties happens at every stage in film industry
  • సినీ పరిశ్రమలోని చీకటి కోణాలపై సునీత సంచలన వ్యాఖ్యలు
  • పవర్ ఉన్న వాళ్లు అవతలి వాళ్లను వాడుకోవాలని చూస్తారని వెల్లడి
  • అవకాశాల కోసం ఆడపిల్లలు ఏడుస్తూనే భరిస్తారన్న సునీత

ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత సినిమా పరిశ్రమలోని చీకటి కోణాలపై, ముఖ్యంగా మహిళల సేఫ్టీపై అత్యంత భయంకరమైన నిజాలను బయటపెట్టారు. ఇటీవల హేమ కమిటీ రిపోర్ట్, ఆ తర్వాత ఇండస్ట్రీలో మహిళల రక్షణపై డిబేట్స్ నడుస్తున్న తరుణంలో... సునీత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌ను షేక్ చేస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ కొత్తగా వచ్చే అమ్మాయిలకు ఎంతవరకు సేఫ్? అనే ప్రశ్నపై ఆమె స్పష్టంగా మాట్లాడారు.


ఇండస్ట్రీలో కొనసాగడం అంత ఈజీ కాదని సునీత అన్నారు. "ఒక అమ్మాయి ఇండస్ట్రీకి రావాలంటే ఆమెకు కచ్చితంగా నాలుగు శక్తులు ఉండాలి. అవి.. ఎమోషనల్ (మానసిక స్థైర్యం), ఫిజికల్, మెంటల్, ఫైనాన్షియల్ స్ట్రెంత్స్. ఈ నాలుగూ లేకపోతే ఇండస్ట్రీ ఇక్కడ ప్రతి క్షణం నరకం చూపిస్తుంది. కఠినమైన పరీక్ష పెడుతుంది. ఇండస్ట్రీ అసలు సేఫ్ కాదు" అని స్పష్టం చేశారు.


ఇండస్ట్రీలో అథారిటీ, పవర్ చేతుల్లో పెట్టుకున్న కొందరు వ్యక్తులు... అవతలి వారి బలహీనతలను ఎలా క్యాష్ చేసుకుంటారో సునీత దాపరికం లేకుండా వెల్లడించారు. "ఇక్కడ పవర్ ఉన్నవాళ్లు అవతలి వారిని వేధించాలని లేదా వాడుకోవాలని చూస్తారు. కేవలం కొత్తగా ఛాన్సుల కోసం వచ్చే వాళ్లనే కాదు... ఇండస్ట్రీలో ఆల్రెడీ మంచి పేరు, క్రేజ్ తెచ్చుకున్న వాళ్లను కూడా వదలరు. చేతులు వేయడం, అనవసరమైన చనువు తీసుకోవడం వంటివి ప్రతి స్టేజ్‌లో ఉంటాయి" అని తెలిపారు.


"ఒక మగాడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో... ఆ మాటల్లోనే లేదా అతడు తాకిన ఒకే ఒక్క టచ్‌లోనే ఆడపిల్లలకి వెంటనే తెలిసిపోతుంది. చాలా మంది వేరే దారి లేక, సినిమా అవకాశాల కోసం అవన్నీ భరిస్తూ లోపల ఏడుస్తారు. కానీ, నాలాంటి వాళ్లు మాత్రం ఆ పనులు చేయకుండా, అలాంటి వాతావరణం నచ్చక ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చేస్తారు" అని సునీత చెప్పారు.

Sunitha
Singer Sunitha
Tollywood
Hema Committee Report
Women Safety Film Industry
Film Industry Harassment

More Telugu News