నెట్టింట వైరల్ అవుతున్న ‘సుశీల దీదీ’ క్రేజీ రెజ్యూమే.. ఐటీ ఉద్యోగులకు కూడా ఇంత ఆలోచన రాలేదేమో!

Sushila Didi creative resume goes viral on social media
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పనిమనిషి రెజ్యూమె
  • తనను తాను 'SAF-AI' ఏజెంట్‌గా పేర్కొన్న సుశీల దీదీ
  • కార్పొరేట్ స్టైల్‌లో హాస్యం జోడించి సీవీ రూపకల్పన
  • దీని వెనుక అర్బన్ కంపెనీ మార్కెటింగ్ వ్యూహం
  • నైపుణ్యాలను ప్రదర్శించడంలో ఇదొక కొత్త పాఠమంటున్న నిపుణులు
ఉద్యోగం కోసం రెజ్యూమె (సీవీ)ను ఎలా తయారు చేసుకోవాలో.. ఎవరైనా సుశీల దీదీని చూసి నేర్చుకోవాల్సిందే! అర్బన్ కంపెనీకి చెందిన 'ఇన్‌స్టాహెల్ప్' సర్వీస్‌లో పనిచేసే సుశీల దీదీ అనే పనిమనిషి తయారు చేసిన ఒక క్రియేటివ్ రెజ్యూమె ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది. కంటెంట్ క్రియేటర్ అన్మోల్ గార్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో దీనిని షేర్ చేయడంతో ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

సాధారణంగా పనిమనుషులు చేసే ఇల్లు తుడవడం, గిన్నెలు కడగడం వంటి పనులనే.. ఈ రెజ్యూమెలో ఎంతో తెలివిగా, హాస్యాన్ని జోడిస్తూ ఒక ప్రొఫెషనల్ కార్పొరేట్ స్టైల్‌లో ప్రెజెంట్ చేసిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

నేను మీ 'సాఫ్ ఏఐ' ఏజెంట్‌ను!
"మీ జీవితాన్ని సులభతరం చేసే 'సాఫ్ ఏఐ’ (SAF-AI’ ఏజెంట్‌ను నేనే" (Safai అంటే హిందీలో శుభ్రం చేయడం, దానిని AI ఏజెంట్‌గా మార్చారు) అంటూ ఈ రెజ్యూమె చాలా కాన్ఫిడెంట్‌గా ప్రారంభమవుతుంది. తన సర్వీసులను ‘3Cs’ (Clean floors, Clean utensils, Clean clothes) అంటూ చాలా స్పష్టంగా వివరించారు.

అంతేకాకుండా, రోజువారీ పనుల జాబితా కాకుండా తను సాధించిన ఫలితాలను నంబర్లతో పాటు పేర్కొనడం విశేషం. ‘ఈరోజు నేను పనికి రాను (Aaj nahi aaungi) అని యజమానులు పడే టెన్షన్‌ను 1,250కి పైగా ఇళ్లలో తగ్గించాను’ అని, అలాగే ‘పార్టీల తర్వాత ఇల్లు సర్దలేక ఇబ్బంది పడే 500 మందికి పైగా బ్యాచిలర్ పిల్లలను నైట్‌మేర్స్ నుండి కాపాడాను’ అంటూ క్రేజీ పాయింట్లను జోడించారు.

      
కస్టమర్ సంతృప్తి.. ఫైవ్ స్టార్ రేటింగ్!
తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ ఎవరి వద్దా ‘పని బాగా చేయలేదు’ అనే మాట వినలేదని, 2,978 కంటే ఎక్కువ '5స్టార్' రేటింగ్‌లు సాధించి అందరి ‘ఫేవరెట్ దీదీ’గా రికార్డు సృష్టించానని ఆమె తన అచీవ్‌మెంట్స్ సెక్షన్‌లో రాసుకున్నారు.

ఈ వినూత్న మార్కెటింగ్ స్ట్రాటజీ వెనుక అర్బన్ కంపెనీ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ గ్రోసరీ డెలివరీ యాప్ 'బ్లింకిట్' ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులతో పాటు ఈ రెజ్యూమె ప్రింట్లను కూడా కస్టమర్లకు పంపిణీ చేశారు. ఉద్యోగం ఏదైనా సరే.. మనల్ని మనం ఎలా బ్రాండ్ చేసుకోవాలో, మన నైపుణ్యాలను ఎంత ఆకర్షణీయంగా ప్రెజెంట్ చేయాలో చెప్పడానికి ఈ వైరల్ సీవీ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కెరీర్ నిపుణులు సైతం ప్రశంసిస్తున్నారు.
Go Back to Shorts
Sushila Didi
Urban Company
Viral Resume
InstaHelp
Creative CV
Anmol Garg

More Telugu News