పవన్ కల్యాణ్ ను కలిసిన రామ్ చరణ్... ఫొటోలు ఇవిగో!
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భేటీ
- మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో సమావేశం
- మర్యాదపూర్వకంగా బాబాయ్ ను కలిసిన రామ్ చరణ్
- ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమం కోసం మంగళగిరికి వచ్చిన చరణ్
అమరావతిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) వేడుకకు హాజరయ్యేందుకు రామ్ చరణ్ మంగళగిరి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నేరుగా జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి, తన బాబాయ్ పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు రామ్ చరణ్ అభినందనలు తెలియజేశారు. అనంతరం వీరిద్దరూ కాసేపు ముచ్చటించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్‌ను రామ్ చరణ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి సంబంధించిన ఛాయాచిత్రాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.