ఈ రోజుల్లో మాట్లాడాలంటేనే భయం: రజనీకాంత్
- బహిరంగంగా మాట్లాడలేకపోతున్నామన్న రజనీకాంత్
- తన మాటలను నిరంతరం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆవేదన
- మనల్ని ఇష్టపడని వారికి మనం ఏది చేసినా నచ్చదని వ్యాఖ్య
సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం టైటిల్‌ను బుధవారం చెన్నైలో అధికారికంగా ప్రకటించారు. రజనీకాంత్ 173వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ధర్మన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ, వర్తమాన పరిస్థితుల్లో బహిరంగంగా మాట్లాడాలంటేనే భయమేస్తోందని, తన మాటలను నిరంతరం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇటీవలి కాలంలో వేదికలపై మాట్లాడాలంటేనే సంకోచించాల్సిన పరిస్థితి నెలకొంది. నేను మాట్లాడితే అదో ఒక సమస్యగా మారుతోంది. మౌనంగా ఉంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ మాట్లాడితే, ఈ సమయంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని అడుగుతున్నారు. అసలు ఏమీ మాట్లాడొద్దని మరికొందరు సలహాలిస్తున్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. మనల్ని ఇష్టపడని వారికి మనం ఏం చేసినా నచ్చదు" అని రజనీకాంత్ పేర్కొన్నారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ, "మేమిద్దరం ఏవీఎం స్టూడియోలోని ఒక వేప చెట్టు కింద కూర్చుని పెద్ద కలలు కన్నాం. నేడు ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నాం. ఈ సినిమా పట్ల రజనీకాంత్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. తాను కమల్ హాసన్ నిర్మాణంలో నటిస్తున్నానని అందరికీ ఫోన్లు చేసి మరీ చెబుతున్నారు" అని సరదాగా వ్యాఖ్యానించారు.