కొక్కిలగడ్డ మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేశ్
- స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఐటీ శాఖ మంత్రి
- పాఠశాల భవనం ప్రారంభించిన అనంతరం ఆలయానికి రాక
- పర్యటనలో మంత్రితో పాటు పాల్గొన్న ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు
అనంతరం ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని లోకేశ్ ప్రత్యేక అర్చనలు జరిపించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి, ఆశీర్వచనాలు పలికారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, తెనాలి శ్రావణ్ కుమార్, గళ్లా మాధవి, భాష్యం ప్రవీణ్, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, బోడె ప్రసాద్‌తో పాటు పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





