రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తాం: వసంత కృష్ణప్రసాద్

  • ప్రజాహితమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న వసంత కృష్ణప్రసాద్
  • కొండపల్లి ప్రజాదర్బార్ కార్యక్రమంలో అర్జీలను స్వీకరించిన వైనం
  • ప్రజలకు అధికారులు అండగా ఉండాలన్న ఎమ్మెల్యే

ప్రజాహితమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా, సామాజిక పింఛన్లు, ఇళ్ల స్థలాలు, అంతర్గత రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా వంటి పౌర సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున వినతి పత్రాలను అందజేశారు. అర్జీలను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులకు కృష్ణప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. అధికారులు ఆఫీసులకే పరిమితం కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైలవరం జనసేన ఇన్‌ఛార్జి అక్కల గాంధీతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.


Vasantha Krishna Prasad
Mylavaram MLA
Praja Darbar Kondapalli
Andhra Pradesh Welfare Schemes
TDP Janasena BJP Alliance
NTR District News

More Telugu News