'పెద్ది' టీమ్‌తో యూకేకు రామ్ చరణ్.. అభిమానులతో నేరుగా భేటీ

Ram Charan to visit UK with Peddi team to meet fans
  • 'పెద్ది' సినిమా విజయంతో యూకే పర్యటనకు రామ్ చరణ్
  • అభిమానులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రత్యేక కార్యక్రమం
  • జూన్ 27న హౌన్స్‌లో సినీవరల్డ్‌లో స్పెషల్ స్క్రీనింగ్
  • ప్రేక్షకులతో నేరుగా ముచ్చటించనున్న మెగా పవర్ స్టార్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' చిత్రానికి, అందులో ఆయన నటనకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఈ సినిమా మంచి ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపేందుకు రామ్ చరణ్ తన 'పెద్ది' చిత్ర బృందంతో కలిసి యూకే వెళ్లనున్నారు.

ఈ నెల 27న యూకేలోని హౌన్స్‌లోలో ఉన్న సినీవరల్డ్‌లో 'పెద్ది' సినిమా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్స్‌కు రామ్ చరణ్, చిత్ర బృందం హాజరుకానున్నారు. అక్కడకు వచ్చే అభిమానులతో, ప్రేక్షకులతో ఆయన నేరుగా ముచ్చటించి, సినిమాను ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు. యూకేలో రామ్ చరణ్‌ను ప్రత్యక్షంగా కలుసుకుని, ఆయనతో మాట్లాడేందుకు అభిమానులకు ఇదొక మంచి అవకాశంగా నిలవనుంది.

సినిమా విడుదలై మంచి విజయం సాధించినప్పటికీ, నిర్మాత వెంకట సతీశ్‌ కిలారు ప్రమోషన్ల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. విడుదల తర్వాత కూడా ప్రచార కార్యక్రమాలను వినూత్నంగా కొనసాగిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.
Go Back to Shorts
Ram Charan
Peddi Movie
Ram Charan UK Visit
Cineworld Hounslow
Peddi Movie Success
Venkata Satish Kilaru

More Telugu News