‘తమిళ్‌ వెట్రి కొండాన్‌’.. ఎమ్మెల్యే పల్లవి బిడ్డకు నామకరణం చేసిన సీఎం విజయ్‌!

CM Vijay names MLA Pallavi child Tamil Vetri Kondan
  • విజయ్‌ని కలిసి తన బిడ్డకు నామకరణం చేయాలని కోరిన పల్లవి
  • చంటి బిడ్డను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని పేరు పెట్టిన విజయ్
  • తన బిడ్డను ఇప్పటి నుంచి 'టీవీకే' అని పిలుచుకుంటామన్న పల్లవి

తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. తిరు.వి.క.నగర్‌ ఎమ్మెల్యే పల్లవి చంటిబిడ్డకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ నామకరణం చేశారు. నిన్న శాసనసభ కార్యక్రమాలు ముగించుకుని సచివాలయం నుంచి ఇంటికి బయలుదేరుతున్న విజయ్‌ను పల్లవి తన చంటిబిడ్డను తీసుకుని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం విజయ్‌కు ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, తన బిడ్డకు నామకరణం చేయాల్సిందిగా కోరారు.


ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి విజయ్.. పసిబిడ్డను ఎంతో ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుని ‘తమిళ్‌ వెట్రి కొండాన్‌’ అని పేరు పెట్టారు. ఈ విషయమై పల్లవి మీడియాతో మాట్లాడుతూ... గతంలో విజయ్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘జననాయగన్‌’లో ఆయన క్యారెక్టర్ పేరు ‘వెట్రి కొండాన్‌’ అని, దానికి ‘తమిళ్’ జోడించి ముఖ్యమంత్రి తన బిడ్డకు ఈ పేరు పెట్టారని ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై తన బిడ్డను షార్ట్ ఫామ్‌లో ‘టీవీకే’ అని పిలుచుకుంటామని చెప్పారు.


తన బిడ్డకు విజయ్ చేతుల మీదుగా నామకరణం జరగాలనేది తన సుదీర్ఘకాల కల అని, అది ఈరోజు నెరవేరడం అమితానందాన్ని కలిగించిందని ఎమ్మెల్యే పల్లవి పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జన్మించిన తన బిడ్డకు పార్టీ పేరైన ‘టీవీకే’ వచ్చేలా నామకరణం చేస్తానని ఆమె గతంలోనే ప్రకటించడం ఇక్కడ గమనార్హం.

Go Back to Shorts
Joseph Vijay
MLA Pallavi
Tamil Vetri Kondan
TVK
Tamil Nadu Politics
Thiru Vi Ka Nagar

More Telugu News