ఐసీసీ కొత్త గైడ్‌లైన్స్‌పై సచిన్ హర్షం... మహిళా క్రికెట్‌కు భారీ బూస్ట్

Sachin Tendulkar praises new ICC guidelines big boost for women cricket
  • ప్రెగ్నెన్సీ తర్వాత తిరిగి ఆటకు వచ్చేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు
  • మాతృత్వం, ప్రొఫెషనల్ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసేలా ప్రోత్సాహం
  • క్రీడాకారిణుల మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత
  • మాతృత్వం కోసం కెరీర్‌ను వదులుకోవద్దన్న ఐసీసీ చైర్మన్ జై షా
మహిళా క్రికెటర్ల కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రవేశపెట్టిన నూతన మార్గదర్శకాలపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. ప్రసవానంతరం మహిళా క్రీడాకారిణులు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు రూపొందించిన ఈ నిబంధనలు, మహిళా క్రికెట్‌కు ఒక 'భారీ ఊతం' అని ఆయన అభివర్ణించారు. మాతృత్వం మరియు వృత్తిగత కెరీర్‌ను సమన్వయం చేసుకునేందుకు ఈ మార్గదర్శకాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

ఐసీసీ తాజాగా 'రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ గైడ్‌లైన్స్‌'ను విడుదల చేసింది. గర్భధారణకు ముందు, ఆ సమయంలో మరియు ప్రసవం తర్వాత క్రీడాకారిణుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరు దశల విధానాన్ని ఇందులో పొందుపరిచారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెటర్ల కోసం ఒక నిర్దిష్ట కార్యాచరణను (Framework) రూపొందించడం ఇదే తొలిసారి.

మాతృత్వం కారణంగా ఏ క్రీడాకారిణి కూడా తన దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఈ మార్గదర్శకాలను తీసుకొచ్చినట్లు ఐసీసీ ఛైర్మన్ జై షా తెలిపారు. గతంలో చాలామంది క్రీడాకారిణులు కుటుంబ బాధ్యతల నిమిత్తం కెరీర్‌కు మధ్యలోనే వీడ్కోలు పలకాల్సి వచ్చేది. ఈ నూతన విధానం ప్రతిభావంతులైన క్రీడాకారిణులు ఆటలో సుదీర్ఘకాలం కొనసాగేందుకు తోడ్పడుతుందని ఆయన ఆకాంక్షించారు.                                
Go Back to Shorts
Sachin Tendulkar
ICC Women Cricket Guidelines
Post Pregnancy Return to Play
Jay Shah
International Cricket Council
Women Cricket Support Framework

More Telugu News