తెలంగాణ హౌసింగ్ బోర్డ్ బంపర్ ఆఫర్.. పేరు సూచిస్తే లక్ష రివార్డ్
- హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణానికి భారీ పథకం
- పథకానికి మంచి పేరు సూచిస్తే లక్ష రూపాయల నగదు బహుమతి
- తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సూచనలు పంపాలి
- జూన్ 28వ తేదీ తుది గడువు
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) ప్రాంతంలో లక్ష ఇళ్లను నిర్మించాలన్నది ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ భారీ ప్రాజెక్టుకు సముచితమైన పేరును నిర్ణయించే ప్రక్రియలో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని భావిస్తున్నట్లు హౌసింగ్ బోర్డ్ వైస్-ఛైర్మన్ గౌతమ్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు తమ సూచనలను tghd.official అనే అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా సమర్పించవచ్చు. పేర్లను పంపేందుకు 2026 జూన్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.