వ్యవసాయ బావిలో మొసలి.. హడలెత్తిపోయిన రైతులు
- మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యవసాయ బావిలో మొసలి
- సహాయక చర్యలు చేపట్టడంలో అటవీ సిబ్బంది జాప్యం
- స్థానిక యువకులే వల వేసి మొసలిని బయటకు తీసిన వైనం
- సురక్షిత ప్రాంతానికి తరలించనున్న అటవీ అధికారులు
సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, సహాయక చర్యలు చేపట్టడంలో కొంత జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక రైతులు, యువకులే స్వయంగా రంగంలోకి దిగారు. ఎంతో సాహసంతో వలల సహాయంతో మొసలిని చాకచక్యంగా బంధించి, సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం మొసలిని పరిశీలించిన అటవీ అధికారులు, దానిని సురక్షితమైన సహజ ఆవాసానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.