ఉప్పల్ స్టేడియంలో తిలక్ వర్మ విశ్వరూపం.. 259 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసిన మెదక్ ఫాల్కన్స్!
- టీజీ20లో వరంగల్ వారియర్స్‌పై మెదక్ ఫాల్కన్స్ 3 వికెట్ల తేడాతో విజయం
- 20 ఓవర్లలో 258 పరుగుల భారీ స్కోరు చేసిన వరంగల్ వారియర్స్
- 32 బంతుల్లోనే వరంగల్ కెప్టెన్ అమన్ రావు సెంచరీ
- 136 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించిన మెదక్ కెప్టెన్ తిలక్ వర్మ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న 'శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20' లీగ్ సీజన్-1లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. మ్యాచ్ నంబర్ 3లో వరంగల్ వారియర్స్ నిర్దేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మెదక్ ఫాల్కన్స్ జట్టు ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్, టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అద్భుతమైన సెంచరీతో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన వరంగల్ వారియర్స్ జట్టుకు కెప్టెన్ అమన్‌రావు పేరాల ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎంపికైన 22 ఏళ్ల అమన్‌రావు కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 101/0 కు చేరింది. ఆ తర్వాత కూడా బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 32 బంతుల్లోనే లీగ్‌లోనే మొట్టమొదటి సెంచరీ మార్కును అందుకున్నాడు. రాహుల్ కుంట బౌలింగ్‌లో అవుట్ అయ్యే సమయానికి అమన్‌రావు 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్లతో 142 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. హర్షిత్ చౌదరి (35), మురుగన్ అభిషేక్ (32) రాణించడంతో వరంగల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 258 భారీ స్కోరు సాధించింది. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ (2/29) రాణించాడు.
అనంతరం 259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ ఫాల్కన్స్ ఇన్నింగ్స్ కూడా అంతే వేగంగా ప్రారంభమైంది. పవర్‌ప్లేలో 85 పరుగులు చేసినప్పటికీ, మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయి 15వ ఓవర్ ముగిసేసరికి 190 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తీవ్ర సంక్షోభంలో పడింది. చివరి 5 ఓవర్లలో 65 పరుగులు కావాల్సిన తరుణంలో కెప్టెన్ తిలక్ వర్మ కేవలం 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
విక్రమ్ నాయక్ (12 బంతుల్లో 27)తో కలిసి తిలక్ 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఖరి ఓవర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నప్పటికీ తిలక్ వర్మ తన క్లాస్ బ్యాటింగ్‌తో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న తిలక్ 14 ఫోర్లు, 8 సిక్సర్లతో 136 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో మెదక్ ఫాల్కన్స్ 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని సొంతం చేసుకుంది.