బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం.. ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా!
- లేబర్ పార్టీ నాయకత్వాన్నీ వీడుతున్నట్లు ప్రకటన
- సొంత పార్టీ నుంచే పెరిగిన ఒత్తిడి
- దేశ ప్రయోజనాల కోసమే నిర్ణయమని స్టార్మర్ వ్యాఖ్య
- 100 మందికిపైగా ఎంపీల నుంచి రాజీనామా డిమాండ్
- పదేళ్లలో బ్రిటన్‌కు ఏడో ప్రధాని మార్పు
బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ (63) తన పదవికి, అధికార లేబర్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సొంత పార్టీ నుంచే పెరిగిన ఒత్తిడి, నాయకత్వంపై అసంతృప్తి నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
డౌనింగ్ స్ట్రీట్‌లోని అధికార నివాసం నుంచి భార్యతో కలిసి బయటకు వచ్చిన స్టార్మర్‌కు మద్దతుదారులు చప్పట్లతో వీడ్కోలు పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన దేశ ప్రయోజనాలనే ఎప్పుడూ ముందుంచానని చెప్పారు. ‘‘నేను ప్రేమించే దేశాన్ని ముందు ఉంచడానికే ప్రతి నిర్ణయం తీసుకున్నాను’’ అని పేర్కొన్నారు.
2024 సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించిన విషయాన్ని స్టార్మర్ గుర్తుచేశారు. తమ ప్రభుత్వం పలు రంగాల్లో పురోగతి సాధించిందని తెలిపారు. ఆర్థిక వృద్ధి, వేతనాల పెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సేవల మెరుగుదల, కార్మికులు-అద్దెదారుల హక్కుల బలోపేతం వంటి అంశాలను ప్రస్తావించారు.
రక్షణ వ్యయాన్ని పెంచడం, అక్రమ వలసలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడం, చిన్నారుల పేదరికం తగ్గించే కార్యక్రమాలు అమలు చేయడం తమ ప్రభుత్వ ప్రధాన విజయాలని పేర్కొన్నారు.
అయితే గత కొన్ని నెలలుగా స్టార్మర్ నాయకత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేకపోయారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. పలు విధానాలపై వెనక్కి తగ్గడం, ప్రజాదరణ తగ్గడం కూడా ఆయనపై ఒత్తిడిని పెంచింది. లేబర్ పార్టీకి చెందిన 100 మందికిపైగా ఎంపీలు స్టార్మర్ రాజీనామా చేయాలని లేదా పదవి వీడే గడువును ప్రకటించాలని బహిరంగంగా డిమాండ్ చేసినట్లు సమాచారం.
స్టార్మర్ వైదొలగడంతో గత పదేళ్లలో బ్రిటన్‌లో ఏడుగురు ప్రధానులు మారినట్లైంది. తరచూ నాయకత్వ మార్పులు చోటుచేసుకోవడం దేశ రాజకీయాల్లో నెలకొన్న అస్థిరతకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజా సేవలపై ఒత్తిడి, ఆర్థిక సవాళ్లు, అక్రమ వలసల వంటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనే విమర్శలు బ్రిటన్‌లో పెరుగుతున్నాయి.