భారతీయ భామలతో ఇంగ్లండ్ యువ క్రికెటర్ ప్రేమాయణం!

  • ఇద్దరు భామలతో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ జాకబ్ బెథెల్ డేటింగ్!
  • బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ అంకితా పటేల్‌తో దిగిన ఫొటో వైరల్
  • మరోవైపు యువనటి ఆద్యా ఆనంద్ ఇన్‌స్టా పోస్టులకు బెథెల్ లైక్స్  
  • డేటింగ్ రూమర్లపై ముగ్గురు నుంచీ స్పందన కరవు 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్న ఇంగ్లండ్  యువ ఆల్ రౌండర్ జాకబ్ బెథెల్ (22) చుట్టూ ఇప్పుడు నెట్టింట లవ్ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ యంగ్ క్రికెటర్ ఒక భారతీయ యువతితో ప్రేమలో ఉన్నాడంటూ రెండు రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 

ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ.. ఒక యువతితో జాకబ్ అత్యంత సన్నిహితంగా, రొమాంటిక్ పోజ్‌లో ఉన్న ఫొటో ఒకటి లీకై వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో సదరు యువతి ముఖం స్పష్టంగా కనిపించనప్పటికీ, నెటిజన్లు ఆమెను బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ అంకితా పటేల్‌గా గుర్తిస్తున్నారు. అంకిత గతంలో శిల్పా శెట్టి, పాలక్ తివారీ, హీనా ఖాన్ వంటి స్టార్ సెలబ్రిటీలకు మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ లవ్ స్టోరీ ఇక్కడితో ఆగకుండా మరో కొత్త మలుపు కూడా తీసుకుంది. జాకబ్ బెథెల్‌కు యువ నటి ఆద్యా ఆనంద్‌తో కూడా అఫైర్ ఉందంటూ నెటిజన్లు మరో కోణాన్ని తెరపైకి తెచ్చారు. ఆద్యా ఆనంద్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ప్రతి పోస్ట్‌ను బెథెల్ రెగ్యులర్‌గా లైక్ చేస్తుండటమే కాకుండా, ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ ప్రైవేట్‌గా కలుసుకున్నారంటూ కొన్ని స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ ఇద్దరు భామల్లో బెథెల్ అసలైన గర్ల్‌ఫ్రెండ్ ఎవరంటూ డిబేట్లు మొదలుపెట్టారు. గతంలో భారతీయ అమ్మాయిలను పెళ్లాడిన అంతర్జాతీయ క్రికెటర్ల బాటలోనే బెథెల్ కూడా నడుస్తున్నాడా అంటూ 'ఫారిన్ అల్లుడు' హాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

అయితే, ఈ డేటింగ్, ప్రేమ వ్యవహారాలపై ఇప్పటివరకు అటు జాకబ్ బెథెల్ కానీ, ఇటు అంకితా పటేల్ లేదా ఆద్యా ఆనంద్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అన్‌వెరిఫైడ్ గాసిప్స్ మాత్రమేనని ఫ్యాక్ట్ చెక్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌తో పాటు ఐపీఎల్‌లోనూ బెథెల్ అద్భుత ప్రదర్శనతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. 

Jacob Bethell
Royal Challengers Bengaluru
Ankita Patel
Aadya Anand
RCB young star
Jacob Bethell dating rumors

More Telugu News