భారతీయురాలినని చెప్పగానే ‘ఏ తెగ?’ అని అడిగారు.. భార్య ఉష గురించి జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- ‘డైరీ ఆఫ్ ఎ సీఈవో’ పాడ్‌కాస్ట్‌లో భార్య ఉషా వాన్స్ గురించి జేడీ వాన్స్
- తల్లి అన్న మాటలు గుర్తు చేసుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు
- ఉష రెడ్ ఇండియన్ తెగకు చెందినదని భావించిందన్న వాన్స్
- యేల్ లా స్కూల్‌లో ఉషతో పరిచయం
- 2014లో హిందూ, క్రైస్తవ పద్ధతుల్లో వివాహం
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా వాన్స్ భారతీయ నేపథ్యం గురించి, ఆమెను మొదటిసారి తమ కుటుంబానికి పరిచయం చేసినప్పుడు ఎదురైన ఒక విచిత్రమైన అనుభవాన్ని పంచుకున్నారు. ‘డైరీ ఆఫ్ ఎ సీఈవో’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన.. తమ 12 ఏళ్ల వివాహ బంధంలో ఎదురైన సాంస్కృతిక వ్యత్యాసాల గురించి సరదాగా మాట్లాడారు.
తాను మొదటిసారి ఉష గురించి తన తల్లికి చెబుతూ.. ఆమె ఒక ఇండియన్ అని వివరించినప్పుడు, తన తల్లి ఏమాత్రం దురుద్దేశం లేకుండా, కేవలం ప్రపంచంపై అవగాహన లేకపోవడం వల్ల "ఆమె ఏ తెగకు (రెడ్ ఇండియన్ ట్రైబ్) చెందినది?" అని అడిగినట్లు వాన్స్ గుర్తుచేసుకున్నారు. అమెరికాలోని గ్రామీణ ప్రాంతానికి (అప్పలాచియన్ మూలాలు) చెందిన తమ కుటుంబానికి, విదేశాల నుంచి వచ్చిన వలసదారుల సంస్కృతిపై అప్పట్లో ఎంత తక్కువ అవగాహన ఉండేదో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
అమెరికా సెకండ్ లేడీగా ఉన్న ఉషా వాన్స్ (పెళ్లికి ముందు చిలుకూరి) పక్కా తెలుగు కుటుంబానికి చెందిన మహిళ. ఆమె తల్లిదండ్రులైన రాధాకృష్ణ చిలుకూరి, లక్ష్మి చిలుకూరి 1980ల కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్లి కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో స్థిరపడ్డారు.
ఉన్నత విద్యావంతులైన ఈ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో ఉష 1986లో జన్మించారు. ఆమె తండ్రి మెకానికల్ ఇంజనీర్‌గా, తల్లి మాలిక్యులర్ బయోలాజిస్ట్‌గా స్థిరపడ్డారు. జేడీ వాన్స్, ఉష ఇద్దరూ ప్రఖ్యాత యేల్ లా స్కూల్‌లో చదువుకుంటున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2014లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాలు కలసి వచ్చేలా ఇరు మతాల పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. త్వరలోనే నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సమాచారం.
తన జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ‘హిల్బిల్లీ ఎలిజీ’ పుస్తకంలో పేర్కొన్నట్లు.. తన చిన్ననాటి అస్తవ్యస్తమైన కుటుంబ వాతావరణంతో పోలిస్తే, ఉష, ఆమె తల్లిదండ్రుల క్రమశిక్షణతో కూడిన సంప్రదాయ కుటుంబం తన జీవితానికి ఒక స్థిరత్వాన్ని ఇచ్చిందని జేడీ వాన్స్ ఎప్పుడూ కొనియాడుతుంటారు. తన అమ్మమ్మ ‘మామావ్’ లాగే ఉష కూడా ఎంతో దృఢమైన మనస్తత్వం, స్పష్టమైన ఆలోచనలు కలిగిన మహిళ అని ఆయన ఈ ఇంటర్వ్యూలో ప్రశంసించారు. అమెరికా రాజకీయ చరిత్రలోనే అత్యున్నతమైన సెకండ్ లేడీ పదవిని అలంకరించిన మొట్టమొదటి భారతీయ సంతతి మహిళగా, అలాగే మొదటి హిందూ మహిళగా ఉషా రికార్డు సృష్టించారు.