గోల్డ్ చైన్లు, క్రూరమైన చూపు.. నాని 'ప్యారడైజ్' నుంచి మరో పవర్ఫుల్ పాత్ర!
- నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో 'ది ప్యారడైజ్'
- భయంకరమైన పాత్రలో నటుడు రాఘవ్ జుయల్
- ఆగస్టు 21న సినిమా గ్రాండ్ రిలీజ్
- తెలుగు సహా 8 భాషల్లో విడుదల కానున్న చిత్రం
- కీలక పాత్రల్లో మోహన్ బాబు, సంపూర్ణేశ్ బాబు
నేచురల్ స్టార్ నాని హీరోగా, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ది ప్యారడైజ్'. ఈ సినిమా నుంచి తాజాగా నటుడు రాఘవ్ జుయల్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో ఆయన 'విక్రమ్ మాలిక్' అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు.
చిత్ర నిర్మాణ సంస్థ ఎస్ఎల్వి సినిమాస్ విడుదల చేసిన గ్లింప్స్ వీడియోలో రాఘవ్ జుయల్... మెడలో భారీ గోల్డ్ చైన్లు ధరించి, వర్షం, మంటల మధ్య అత్యంత క్రూరంగా దర్శనమిచ్చారు. ఇప్పటివరకు చూడని ఓ భిన్నమైన, భయంకరమైన అవతార్‌లో ఆయన కనిపిస్తుండటంతో ఈ లుక్ ప్రేక్షకుల్లో తీవ్రమైన ఆసక్తిని రేపుతోంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా రీషూట్లపై కొన్ని నిరాధారమైన వదంతులు వ్యాపించాయి. అయితే, చిత్ర నిర్మాణ సంస్థ వాటిని ఖండిస్తూ స్పష్టత ఇచ్చింది. సినిమా మొదటి రోజు నుంచి స్పష్టమైన ప్రణాళికతోనే ముందుకు సాగుతోందని, ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ పూర్తయిందని తెలిపింది. ఇప్పటివరకు ఒక్క రీషూట్ కూడా జరగలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన లేదని తేల్చిచెప్పింది.
వాస్తవానికి ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కొత్త తేదీగా 2026 ఆగస్టు 21వ తేదీని ఖరారు చేశారు. ఈ కొత్త తేదీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఓనమ్, మిలాద్-ఉన్-నబి, రక్షాబంధన్, జన్మాష్టమి వంటి పండుగల నేపథ్యంలో పలు సెలవులు ఉండటం సినిమాకు అనుకూలించే అంశం.
'ది ప్యారడైజ్'లో కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఇప్పటికే విలన్‌గా మోహన్ బాబు 'షికంజా మాలిక్' పాత్రలో నటిస్తుండగా, సంపూర్ణేష్ బాబు 'బిర్యానీ' అనే మరో పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళం సహా మొత్తం 8 భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.