సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్
- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు
- ఈ నెల 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశం
- తొక్కిసలాట కేసులో A11 నిందితుడిగా ఉన్న బన్నీ
- ఈ ఘటనలో మొత్తం 23 మందిపై ఛార్జ్‌షీట్
టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈ నెల 22న (సోమవారం) వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా (A11) పోలీసులు చేర్చిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
2024 డిసెంబర్ 4న 'పుష్ప 2' సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద భారీగా అభిమానులు గుమిగూడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ దురదృష్టకర ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు, విచారణ జరిపి మొత్తం 23 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఈ ఛార్జ్‌షీట్‌లో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని A1 నుంచి A10 వరకు నిందితులుగా పేర్కొన్న పోలీసులు, అల్లు అర్జున్ను A11గా చేర్చారు. తాజాగా ఈ కేసులో సంబంధం ఉన్న 19 మంది నిందితులకు కోర్టు సమన్లు పంపింది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్‌కు కూడా నోటీసులు అందాయి.