ఐటీ షేర్లలో ‘బ్లడ్ బాత్’.. కారణమిదే..!
- ఇన్ఫోసిస్ షేర్ విలువ 8 శాతం పతనం
- 6 శాతం నష్టాల్లో టీసీఎస్ షేర్లు
- ఆదాయ వృద్ధి అంచనాల్లో యాక్సెంచర్ కోత ప్రభావం
- అమెరికాలో ఐటీ వ్యాపార డిమాండ్‌పై ఆందోళన
స్టాక్ మార్కెట్‌లో శుక్రవారం ఐటీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్రా, విప్రో వంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. అమెరికా ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తాజా అంచనాలే ఇందుకు ప్రధాన కారణంగా మారాయి.
ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్ఫోసిస్ షేర్ 8 శాతానికి పైగా పతనమైంది. నిఫ్టీలో అత్యధింకంగా నష్టపోతున్న షేరుగా నిలిచింది. టీసీఎస్ దాదాపు ఆరు శాతం, హెచ్‌సీఎల్‌టెక్ ఐదు శాతానికి పైగా నష్టాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, విప్రో కూడా 3 నుంచి 5 శాతం మధ్య క్షీణించాయి. ఐటీ షేర్లలో అమ్మకాలు పెరగడంతో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ పతనానికి కేంద్రబిందువుగా యాక్సెంచర్ నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాలను ఆ సంస్థ తగ్గించింది. దీంతో ప్రపంచ ఐటీ సేవల రంగంలో డిమాండ్ బలహీనపడుతోందా అన్న సందేహాలు పెట్టుబడిదారుల్లో మొదలయ్యాయి.
భారత ఐటీ కంపెనీలకు అమెరికా ప్రధాన ఆదాయ వనరు. అక్కడి సంస్థలు టెక్నాలజీ ఖర్చులను తగ్గిస్తే దాని ప్రభావం నేరుగా భారత కంపెనీలపై పడుతుంది. యాక్సెంచర్ ప్రకటన తర్వాత అమెరికాలో లిస్టైన భారత ఐటీ కంపెనీల ఏడీఆర్‌లలో కూడా అమ్మకాలు పెరిగాయి. అదే ప్రభావం దేశీయ మార్కెట్‌లో కనిపించింది.
ఇటీవల ఐటీ కంపెనీలు భారీ ఒప్పందాలు చేసుకుంటున్నప్పటికీ వాటి ఫలితాలు వెంటనే ఆదాయ రూపంలో కనిపించడం లేదు. క్లయింట్లు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అవసరం లేని ప్రాజెక్టులను వాయిదా వేస్తున్నారు. కొత్త ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు కృత్రిమ మేధ ప్రభావం గురించి చర్చ కూడా కొనసాగుతోంది. ఏఐ కొత్త అవకాశాలు తీసుకొస్తుందనే అంచనాలు ఉన్నా, సంప్రదాయ ఐటీ సేవల వ్యాపారంపై దాని ప్రభావం ఎంత వరకు ఉంటుందన్న సందేహం మార్కెట్‌లో కనిపిస్తోంది.
అయితే ఈ పతనం శాశ్వత ధోరణికి సంకేతమా, లేక తాత్కాలిక ప్రతిస్పందన మాత్రమేనా? అన్నది ఇప్పుడే చెప్పలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న త్రైమాసిక ఫలితాలు, అమెరికా మార్కెట్‌లో టెక్నాలజీ ఖర్చుల ధోరణి స్పష్టత ఇస్తాయని చెబుతున్నారు.