రేపే సమంత 'మా ఇంటి బంగారం' విడుదల.. అంచనాలు పెంచుతున్న బుకింగ్స్
- జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా 'మా ఇంటి బంగారం' విడుదల
- సినిమాకు భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్
- టిక్కెట్ల బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయని తెలిపిన చిత్ర యూనిట్
- నందినీ రెడ్డి దర్శకత్వం, రాజ్ నిడిమోరు క్రియేటర్
- చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. రేపు (జూన్ 19న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. పలు ప్రధాన నగరాల్లో షోలు వేగంగా నిండుతుండటంతో సినిమాపై నెలకొన్న అంచనాలు స్పష్టమవుతున్నాయి.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా బుకింగ్స్ చాలా వేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గంట వ్యవధిలోనే దాదాపు 3.49 లక్షల టిక్కెట్లు బుక్ అయినట్లు వారు ప్రకటించడం సినిమాపై ఉన్న క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఈ ట్రెండ్ చూస్తుంటే సినిమాకు తొలిరోజు అదిరిపోయే ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
'ఓ బేబీ' ఫేమ్ నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సమంత భర్త రాజ్ నిడిమోరు క్రియేటర్‌గా వ్యవహరించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందించడం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. సమంత, నందినీ రెడ్డి, రాజ్ నిడిమోరు వంటి విలక్షణమైన ప్రతిభావంతుల కలయికలో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.