మధ్యాహ్నం చేసే ఈ 6 తప్పులు.. బరువు పెరగడానికి కారణం!

  • మధ్యాహ్నం భోజనం మానేయొద్దంటున్న నిపుణులు
  • చిప్స్‌, బిస్కెట్ల వంటి ప్రాసెస్డ్‌ స్నాక్స్‌ తినొద్దు
  • తిన్న తర్వాత గంటల తరబడి కూర్చోవద్దు
  • మరో పనిచేస్తూ తింటే ఎక్కువ తినే ప్రమాదం
  • కాఫీ, కూల్‌ డ్రింక్స్‌ తాగొద్దు
బరువు తగ్గాలనుకునేవారు సాధారణంగా ఉదయం చేసే పనులు, రాత్రి నిద్రపోయే ముందు పాటించే అలవాట్లపై ఎక్కువ దృష్టి పెడతారు. అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గడిచే సమయం కూడా బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో చేసే కొన్ని పొరపాట్లు మెటాబాలిజాన్ని మందగింపజేస్తాయి. ఆకలిని పెంచి బరువు పెరగడానికి దారితీస్తాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం...

1. భోజనం మానేయడం
క్యాలరీలు తగ్గుతాయనే ఉద్దేశంతో కొందరు మధ్యాహ్న భోజనం మానేస్తారు. కానీ దీనివల్ల సాయంత్రానికి బాగా ఆకలి వేసి ఎక్కువగా తినే ప్రమాదముంది. ఫలితంగా బరువు తగ్గడం కాకుండా పెరిగే అవకాశం ఉంటుంది.

2. చిరుతిళ్లు
మధ్యాహ్నం అలసటగా అనిపించినప్పుడు చిప్స్‌, బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్‌ వంటి ప్రాసెస్డ్‌ ఆహారాల వైపు మొగ్గుచూపుతారు. ఇవి అధిక క్యాలరీలు కలిగి ఉండటంతో బరువు పెరగడానికి కారణమవుతాయి.

3. దృష్టి పెట్టాలి
టీవీ చూస్తూ లేదా పని చేస్తూ తినడం వల్ల ఎంత తింటున్నామో తెలియదు. దీంతో అవసరానికి మించి ఆహారం తీసుకునే ప్రమాదం ఉంది.

4. కదలికలు లేకపోవడం
మధ్యాహ్నం తర్వాత పూర్తిగా కూర్చునే పనుల్లోనే ఉండటం మెటాబాలిజాన్ని మందగిస్తుంది. చిన్నపాటి నడక లేదా కొంతసేపు స్వల్ప వ్యాయామం చేయడం మంచిది.

5. క్యాలరీలు ఎక్కువగా ఉన్న పానీయాలు
కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్‌, శీతల పానీయాలు వంటి వాటిలో అధిక క్యాలరీలు ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించకపోగా బరువు పెంచుతాయి.

6. ఎక్కువసేపు కూర్చోవడం
భోజనం తర్వాత గంటల తరబడి కుర్చీలో కూర్చోవడం వల్ల శరీరంలో కొవ్వును కరిగించే ప్రక్రియ మందగిస్తుంది. మెట్లు ఎక్కడం, కొంతదూరం నడవడం వంటి చిన్న అలవాట్లు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.

Weight Gain
Afternoon Habits
Weight Loss Mistakes
Healthy Lifestyle
Metabolism Boost
Diet Tips

More Telugu News