130 అడుగుల పైనుంచి కిందపడ్డా ప్రాణాలతో ఉంది.. నర్స్ వెల్లడించిన వణికిపోయే నిజం!
- తాడు లేకుండానే బంగీ జంప్
- యువతి కిందపడ్డా కొట్టుకున్న ప్రాణం
- నర్స్ చేసిన ప్రయత్నం విఫలం
- ముగ్గురు కేటుగాళ్ల అరెస్ట్
- నిర్లక్ష్యంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం
బ్రెజిల్‌లోని సావోపాలో రాష్ట్రంలో ఒళ్ళు గగుర్పొడిచే ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. 21 ఏళ్ల ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థిని.. 'స్కెలెటన్ బ్రిడ్జ్' (అస్థిపంజర వంతెన)గా పిలిచే ఒక పాడుబడిన వంతెనపై నుంచి సుమారు 130 అడుగుల (40 మీటర్లు) ఎత్తు నుంచి కిందపడి మరణించింది. అయితే, అంత ఎత్తు నుంచి కిందపడిన క్షణాల్లో.. ఆమె వెంటనే చనిపోలేదని, అక్కడికి చేరుకునే సరికి ఆమె ఇంకా శ్వాస తీసుకుంటూ ప్రాణాలతోనే ఉందని ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక నర్స్ వెల్లడించిన వివరాలు ఇప్పుడు అందరినీ కలచివేస్తున్నాయి.
మరణించిన యువతిని మారియా ఎదువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రీటాస్ (21)గా గుర్తించారు. ఆమె శనివారం (జూన్ 13) న 'ఎంట్రే కోర్డాస్' అనే ఒక అన్లైసెన్స్డ్ సంస్థ ఆధ్వర్యంలో రోప్-జంపింగ్ (బంగీ జంప్) చేయడానికి వెళ్లింది. అయితే, ఇన్స్ట్రక్టర్లు ఆమెకు రక్షణ తాడు కట్టకుండానే, 'సూపర్‌మ్యాన్' పొజిషన్లో వంతెనపై నుండి కిందకు నెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు నిందితుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నర్స్ వెల్లడించిన హృదయ విదారక నిజం
ఆ సమయంలో అక్కడ సెలవులో ఉన్న రైజా డయాస్ అనే నర్స్ ప్రమాదాన్ని చూసి వెంటనే కొండ దిగువకు పరుగెత్తింది. ఒక బ్రెజిలియన్ టీవీ ఛానెల్‌తో ఆమె మాట్లాడుతూ.. "నేను కిందకు వెళ్లేసరికి ఆమె ఇంకా బతికే ఉంది. నాడి చాలా బలహీనంగా ఉంది, శ్వాస భారంగా తీసుకుంటోంది. నేను మరికొందరితో కలిసి ఆమెకు సీపీఆర్ (CPR) చేసి కాపాడటానికి ప్రయత్నించాను. కానీ అత్యవసర రెస్క్యూ టీమ్ వచ్చేసరికి తీవ్ర గాయాల వల్ల ఆమె కన్నుమూసింది" అని కన్నీరు పెట్టుకుంది.
ఈ ఘోర నిర్లక్ష్యానికి కారణమైన ముగ్గురు ఇన్స్ట్రక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతికి తాడు కట్టలేదనే విషయాన్ని వారు అంగీకరించినప్పటికీ.. ఆ సమయంలో ఆ పని ఎవరు మర్చిపోయారనేది తమకు గుర్తులేదని పోలీసుల విచారణలో తెలపడం గమనార్హం. ఒక ఉపాధ్యాయురాలిగా ఎదగాలని ఎన్నో కలలు కన్న 22 ఏళ్ల యువతి.. ఇలా నిర్వాహకుల చిన్న పొరపాటు వల్ల ప్రాణాలు కోల్పోవడం బ్రెజిల్ వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది.