భారీ మార్పులతో కొత్త హ్యుందాయ్ i20.. చూస్తే గుర్తుపట్టలేనంత కొత్తగా!

Hyundai i20 with major changes launched with an unrecognizable new look
  • బ్రెజిల్‌లో విడుదలైన సరికొత్త 2027 హ్యుందాయ్ i20
  • హ్యాచ్‌బ్యాక్ నుంచి క్రాసోవర్ తరహా లుక్‌లోకి మారిన డిజైన్
  • డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్లు, ADAS వంటి ప్రీమియం ఫీచర్లు
  • భారత్‌లో 2027 నాటికి వచ్చే అవకాశం, భారీగా పెరగనున్న ధర
  • కొత్త డిజైన్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన నెక్స్ట్ జనరేషన్ i20 కారును బ్రెజిల్‌లో విడుదల చేసింది. ఇప్పటివరకు స్పోర్టీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా ఉన్న i20, ఇప్పుడు పూర్తిగా కొత్త రూపంలోకి మారిపోయింది. ఈ కొత్త మోడల్ చూడటానికి ఒక క్రాసోవర్ లేదా చిన్న SUVలా కనిపిస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

కొత్త i20 డిజైన్‌ను పూర్తిగా మార్చేశారు. బాక్సీ, యాంగ్యులర్ స్టైలింగ్‌తో పాటు, ముందు, వెనుక భాగంలో కనెక్టెడ్ ఫుల్-విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్లను అమర్చారు. పాత మోడల్‌తో పోలిస్తే ఇది పరిమాణంలో కూడా చాలా పెద్దదిగా ఉంది. దీని పొడవు, వెడల్పు, వీల్‌బేస్‌ను పెంచారు. 

అయితే, ఈ కొత్త క్రాసోవర్ లుక్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. చాలామంది నెటిజన్లు పాత స్పోర్టీ లుక్‌తో పోలిస్తే ఈ డిజైన్ బాగోలేదని అభిప్రాయపడుతున్నారు.

క్యాబిన్ లోపల రెండు 12.3-అంగుళాల భారీ స్క్రీన్లు (ఒకటి డిజిటల్ క్లస్టర్, మరొకటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్), వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే, అధునాతన డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), వైర్‌లెస్ ఛార్జర్ వంటి అత్యాధునిక ఫీచర్లను అందించారు. బ్రెజిల్ మార్కెట్ కోసం 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లను ఇచ్చారు.

బ్రెజిల్‌లో ఈ కారు ప్రారంభ ధర మన కరెన్సీలో సుమారు రూ. 18.8 లక్షలుగా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ. 26.3 లక్షల వరకు పలుకుతోంది. ఈ మోడలే 2027 నాటికి భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. అయితే, అధిక ధర, పన్నుల కారణంగా బ్రెజిల్ మోడల్‌ను నేరుగా దిగుమతి చేసే అవకాశాలు తక్కువ. భారత్ కోసం ప్రత్యేకంగా కొన్ని మార్పులు చేసి, ఇక్కడికి అనువైన ఇంజిన్లతో విడుదల చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Hyundai i20
New Hyundai i20 Brazil
Hyundai i20 Crossover
Next Gen Hyundai i20
Hyundai i20 India Launch
Hyundai i20 Features

More Telugu News