01 Fri 08:51 తొలి విమాన ప్రయాణమే చివరిదైంది.. అహ్మదాబాద్ ప్రమాదంలో ఛిన్నాభిన్నమైన కుటుంబం కన్నీటి గాథ అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఏడాది పూర్తి యూకేలోని కుమారుడి వద్దకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన రజనీకాంత్, పుష్పాబెన్ దంపతులు వారి మొదటి విమాన ప్రయాణమే చివరి ప్రయాణం కావడం తీవ్ర విషాదం జీవితాంతం కష్టపడి కొడుకుని డాక్టర్‌ను చేసిన తల్లిదండ్రులు ప్రమాద స్థలి వద్ద కన్నీటిపర్యంతమవుతూ నివాళులర్పించిన కుటుంబ సభ్యులు
02 Fri 08:40 నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఖమ్మం బాలికకు హరీశ్ రావు పరామర్శ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, భవనంపై నుంచి తోసివేత ఘటన తీవ్ర గాయాలతో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు నిందితుడు గౌస్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసిన పోలీసులు బాధితురాలిని పరామర్శించిన హరీశ్ రావు
03 Fri 08:36 ప్రేమను మించిన బంధం మనది: భర్తపై సినీ నటి షామ్నా కాసిం ఎమోషనల్ పోస్ట్ భర్త షానిద్‌కు షామ్నా కాసిం భావోద్వేగ యానివర్సరీ శుభాకాంక్షలు ప్రేమ కంటే గొప్పది ఏదైనా ఉంటే అదే నీపై నాకుంది అంటూ పోస్ట్ చివరి శ్వాస వరకు చేయి వీడొద్దని మాటిచ్చుకున్నామని వెల్లడి ఒకవైపు కుటుంబం, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న పూర్ణ షామ్నా పోస్ట్‌కు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ప్రశంసలు
04 Fri 08:26 ఆఫ్రికా గడ్డపై క్రికెట్ పండుగ.. 2027 వరల్డ్ కప్ తేదీలు వచ్చేశాయ్! 2027 వన్డే ప్రపంచకప్‌కు ఆఫ్రికా దేశాల ఆతిథ్యం అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు మెగా టోర్నీ పాత ఫార్మాట్‌కు జై.. 14 జట్లతో ప్రపంచకప్ నిర్వహణ దక్షిణాఫ్రికాలో అత్యధిక మ్యాచ్‌లు, జింబాబ్వే, నమీబియాలో మరి కొన్ని నిర్వహణ
05 Fri 07:57 శాంతి ఒప్పందంపై ట్రంప్ ప్రకటన.. అలాంటిదేమీ లేదన్న ఇరాన్ ఇరాన్‌పై సైనిక దాడుల ప్రణాళికను రద్దు చేసుకున్న ట్రంప్ శాంతి ఒప్పందానికి ఇరుపక్షాలు ఆమోదం తెలిపాయని ప్రకటన ఇంకా ఏదీ ఖరారు కాలేదన్న ఇరాన్ చర్చలు జరుగుతున్నా, తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపిన టెహ్రాన్
06 Fri 07:39 నేటి మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా.. ! గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతల ప్రభావం హైదరాబాద్‌లో రూ.1,45,630కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం కిలో వెండి ధర రూ.2.59 లక్షలుగా నమోదు
07 Fri 07:34 ఇంటర్ పాసైన మాజీ మావోయిస్టు దేవ్‌జీ 42 ఏళ్ల తర్వాత ఇంటర్ పాసైన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ తెలుగు సబ్జెక్టులో 72 మార్కులతో ఉత్తీర్ణత ఇటీవల లాసెట్‌లో 349వ ర్యాంకు సాధించిన దేవ్‌జీ న్యాయవాద విద్యను అభ్యసించేందుకు మార్గం సుగమం
08 Fri 07:21 కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అండ సొంత నిధులు రూ. 40 లక్షలతో రెండు ఇళ్ల నిర్మాణం కార్యకర్త ఇంటి నిర్మాణ పనుల్లో పాల్గొని శ్రమదానం చేసిన మంత్రి కార్యకర్తల శ్రమ వృథాపోదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా
09 Fri 07:18 పొగాకు రైతులకు ఊరట: గణనీయంగా తగ్గిన బేళ్ల తిరస్కరణ 37శాతం నుంచి 20 శాతానికి పడిపోయిన తిరస్కరణలు నాణ్యమైన పొగాకుకు మార్కెట్‌లో డిమాండ్ పెరగడమే కారణమన్న మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటివరకు 1.56 కోట్ల కిలోల పొగాకును కొనుగోలు చేసిన బోర్డు కొనుగోళ్లపై మంత్రులు, అధికారులతో అచ్చెన్నాయుడు సమీక్ష
10 Fri 07:11 స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి జగన్ లేఖలు: పట్టాభిరామ్ ఆరోపణ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దెబ్బతీయడంలో జగన్ పాత్రపై టీడీపీ ఆరోపణ ప్లాంట్ భూములు అమ్మి నిధులు సమీకరించాలని కేంద్రానికి జగన్ లేఖలు రాశారన్న పట్టాభి ఉక్కు గనుల లీజులను పునరుద్ధరించకుండా అడ్డుకున్నారని విమర్శ జగన్ హయాంలో ఉత్పత్తి తగ్గి, ఉద్యోగుల సంఖ్య పడిపోయిందని ఆరోపణ