ఏపీ లిక్కర్ స్కామ్: రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు 14 రోజుల రిమాండ్
- ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక నిందితులు కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి అరెస్ట్
- నిందితులను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)
- 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన హైదరాబాద్ నాంపల్లి కోర్టు
- చంచల్గూడ జైలుకు నిందితుల తరలింపు
అరెస్టు అనంతరం వీరిని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో వీరిద్దరినీ హైదరాబాద్లోని చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ అరెస్టులకు ముందు హైదరాబాద్లోని సుమారు 10 ప్రాంతాల్లో ఈడీ బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహించాయి.
గత ప్రభుత్వ పాలనలో (2019-2024) మద్యం విధానాలు, రవాణా కాంట్రాక్టుల్లో భారీ అవకతవకలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రాజ్ కేసీరెడ్డిని ఏ1గా, వాసుదేవ రెడ్డిని ఏ2గా అధికారులు పేర్కొన్నారు. గతంలో ఏపీ పోలీసులు ఏర్పాటు చేసిన సిట్ సైతం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయగా, ప్రస్తుతం మనీలాండరింగ్ కోణంలో ఈడీ లోతైన విచారణ జరుపుతోంది.