హ్యాపీ బర్త్ డే ఎన్బీకే.. బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Nandamuri Balakrishna Birthday Wishes From CM Chandrababu Naidu
  • నేడు బాలయ్య పుట్టినరోజు
  • సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
  • సినీ, రాజకీయ, సేవా రంగాల్లో బాలయ్య సేవలను కొనియాడిన వైనం
  • బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా చేస్తున్న సేవలకు ప్రశంస
  • #HappyBirthdayNBK అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేస్తూ ట్వీట్
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన బాలకృష్ణకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్ట్ చేశారు. తన బావమరిది బాలకృష్ణను తన ఆప్తుడు, నటసింహం అని సంబోధిస్తూ ఆయన సేవలను కొనియాడారు.

ఈ మేరకు చంద్రబాబు తన పోస్టులో.. "సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ, మాతృమూర్తి పేరుతో నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తూ మీరు సాగిస్తున్న జీవనయానం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను" అని పేర్కొన్నారు.

"ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నవరస నటనా సార్వభౌముడు, తెలుగువారి అన్న నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులు మీపై కలకాలం ఉండాలని కోరుకుంటూ మరొక్క మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను," అని చంద్రబాబు తన పోస్టులో రాశారు. ఈ పోస్టుకు #HappyBirthdayNBK అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జతచేశారు.
Go Back to Shorts
Nandamuri Balakrishna
Chandrababu Naidu
Hindupur MLA
Basavatarakam Cancer Hospital
Natasimham NBK
NBK Birthday Wishes

More Telugu News