సెక్యూరిటీ గార్డుకు అదిరిపోయే లాటరీ.. స్నేహితులతో కలిసి కొన్న టికెట్ కు రూ.78 కోట్ల ప్రైజ్

Security guard wins massive lottery prize of 78 crores on ticket bought with friends
  • యూఏఈలో నేపాలీ సెక్యూరిటీ గార్డ్‌కు రూ.78 కోట్ల లాటరీ
  • నలుగురు స్నేహితులతో కలిసి బహుమతి పంపకం
  • ఒక్కొక్కరికి రూ.15 కోట్లకు పైగా వాటా
  • ఉద్యోగం వదిలేసి, కుటుంబం కోసం ఇల్లు కడతానన్న విజేత
  • మహీంద్రా థార్, రోలెక్స్ వాచ్ కొనాలన్నది తన కోరిక అని వెల్లడి
అబుదాబిలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న ఓ నేపాలీ యువకుడిని అదృష్టం వరించింది. కేవలం సరదాగా స్నేహితులతో కలిసి కొనుగోలు చేసిన లాటరీ టికెట్, అతడిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. యూఏఈ లాటరీ నిర్వహించిన లక్కీ డే డ్రాలో 26 ఏళ్ల తయాబ్ ఖాన్ ఏకంగా 30 మిలియన్ దిర్హామ్‌లు (సుమారు రూ.78 కోట్లు) గెలుచుకున్నాడు.

వివరాల్లోకి వెళితే, నేపాల్‌కు చెందిన తయాబ్ ఖాన్ మెరుగైన ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం యూఏఈకి వచ్చి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. తన నలుగురు స్నేహితులతో కలిసి తరచుగా డబ్బులు పోగుచేసి లాటరీ టికెట్లు కొనేవాడు. ఈ క్రమంలో ఇటీవల కొన్న టికెట్‌కు గ్రాండ్ ప్రైజ్ తగిలింది. లాటరీ గెలిచినట్టు ఈమెయిల్ రాగానే, మొదట ఏదో చిన్న బహుమతి అనుకున్నానని, నమ్మలేక చాలాసార్లు చెక్ చేసుకున్నానని తయాబ్ చెప్పాడు.

ఈ భారీ మొత్తంతో తన జీవితం మారిపోతుందని తయాబ్ ఆనందం వ్యక్తం చేశాడు. వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేయనున్నట్టు తెలిపాడు. గెలిచిన మొత్తాన్ని ఐదుగురం సమానంగా పంచుకుంటున్నామని, ఒక్కొక్కరికి 6 మిలియన్ దిర్హామ్‌లు (సుమారు రూ.15 కోట్లకు పైగా) వస్తుందని వివరించాడు. ఈ డబ్బుతో నేపాల్‌లో కుటుంబానికి మంచి ఇల్లు కట్టి, అప్పులు తీర్చి, పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తానని చెప్పాడు. అలాగే, తన చిరకాల కోరికలైన మహీంద్రా థార్ కారు, రోలెక్స్ వాచ్ కొనుగోలు చేస్తానని పేర్కొన్నాడు. ఒక సామాన్య గార్డ్ కోటీశ్వరుడు కావడంతో, ఈ వార్త యూఏఈలోని ప్రవాసుల్లో స్ఫూర్తి నింపుతోంది.
Go Back to Shorts
Tayab Khan
UAE Lottery Winner
Abu Dhabi Security Guard Lottery
Big Ticket Abu Dhabi Winner
Nepali Guard Wins 78 Crores
30 Million Dirhams Lottery Prize

More Telugu News