హ్యాట్రిక్ మూవీ మహేశ్‌బాబు తోనేనా?.. క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!

  • ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ. 236.7 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘పెద్ది’ 
  • సినిమా ఘన విజయం సాధించడంతో అఫీషియల్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం 
  • సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో తన తదుపరి చిత్రంపై దర్శకుడు బుచ్చిబాబు లీక్ 
  • సినిమా చర్చల దశలో ఉందని, మరికొంత సమయం పడుతుందని వెల్లడి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల క్లబ్‌ను దాటేసి రికార్డులు తిరగరాస్తోంది. ఈ ఘన విజయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర బృందం సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. "బాక్సాఫీస్ ఛాంపియన్ ‘పెద్ది’ అన్‌స్టాపబుల్.. గ్లోబల్ వైడ్‌గా ఈ చిత్రం మూడు రోజుల్లో రూ. 236.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది" అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం సెలవు దినం కావడం ఈ సినిమాకు మరింత కలిసివచ్చిందని, కలెక్షన్ల జోరు ఇలాగే కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మహేశ్‌బాబుతో హ్యాట్రిక్ మూవీ?
మరోవైపు ‘ఉప్పెన’, ‘పెద్ది’ చిత్రాలతో వరుసగా రెండు భారీ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా.. తన కెరీర్‌లో హ్యాట్రిక్ మూవీని ఎవరితో చేయబోతున్నారనే ఆసక్తి టాలీవుడ్‌లో నెలకొంది. ఈ క్రమంలో ఆయన తన తదుపరి చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో ప్లాన్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ఈ ప్రాజెక్ట్‌పై స్పందిస్తూ ఇండస్ట్రీలో వస్తున్న వార్తలను అంగీకరించారు.

"అవునండీ.. మహేశ్‌బాబుతో తర్వాతి సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనిపై పూర్తి క్లారిటీ రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది" అని బుచ్చిబాబు అన్యపదేశంగా సమాధానమిచ్చారు.  

రామ్ చరణ్ నటనను థియేటర్లలో చూసి ప్రేక్షకులు, అభిమానులు మెచ్చుకుంటుండటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని బుచ్చిబాబు అన్నాడు. తాను పేపర్‌పై ఏ కథనైతే రాసుకున్నానో.. దాన్ని వందకు వంద శాతం తెరపై ఆవిష్కరించగలిగానని, దానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు.

Buchi Babu Sana
Mahesh Babu
Peddi Box Office Collection
Ram Charan Peddi Movie
Buchi Babu Mahesh Babu Film
Telugu Cinema News

More Telugu News