మాస్కోలో వ్యాధి నిర్ధారణ చేసే ఏటీఎం... నారా లోకేష్ ఆశ్చర్యం

  • మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి నారా లోకేష్
  • వ్యాధి నిర్ధారణ చేసే స్బేర్ బ్యాంక్ ఏటీఎంను పరిశీలన
  • ఏఐ, క్వాంటం టెక్నాలజీపై ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతినిధులు
  • డిజిటల్ హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌పై ఆరా
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రష్యా రాజధాని మాస్కోలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అక్కడి ప్రతిష్టాత్మక స్బేర్ సిటీని సందర్శించి, ఆధునిక సాంకేతికతను పరిశీలించారు. టెక్నాలజీ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, వాటి వినియోగంపై ఆయన ప్రత్యేకంగా ఆసక్తి కనబరిచారు.

ఈ సందర్భంగా, స్బేర్ బ్యాంక్‌కు చెందిన ఒక ప్రత్యేక ఏటీఎం మంత్రి లోకేష్ దృష్టిని ఆకర్షించింది. సాధారణ బ్యాంకింగ్ సేవలతో పాటు వ్యాధి నిర్ధారణ చేసే సామర్థ్యం ఉన్న ఈ ఏటీఎం పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. అక్కడి ఆవిష్కరణలను చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అనంతరం, స్బేర్ సిటీ ప్రతినిధులు తమ సంస్థలో జరుగుతున్న పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆర్ & డీ, క్వాంటం టెక్నాలజీ సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సేవలు, డిజిటల్ హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఎడ్యుకేషన్ వంటి అంశాలపై తమకున్న పరిష్కారాలను వారు లోకేష్‌కు తెలిపారు.

Nara Lokesh
Moscow
Sber City
Health Diagnostic ATM
Sberbank
Artificial Intelligence
Digital Healthcare
Russia visit
Quantum Technology
Cyber Security

More Telugu News