హైదరాబాద్‌కు ఉపశమనం.. పలు ప్రాంతాల్లో వర్షం
- హైదరాబాద్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం
- వేసవి తాపం నుంచి నగరవాసులకు ఉపశమనం
- గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో జల్లులు
శనివారం సాయంత్రం గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బోరబండ, యూసుఫ్‌గూడ, ఎస్ఆర్ నగర్, సనత్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. దీంతో ఎండ వేడిమి నుంచి నగరవాసులకు ఊరట లభించింది. ఇక పొరుగున ఉన్న రంగారెడ్డి జిల్లాలోని కొహెడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.