ట్రోల్స్ పట్టించుకోను: నిధి అగర్వాల్
- వరుసగా పరాజయం పాలవుతున్న నిధి నటించిన సినిమాలు
- ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
- తాను టాలెంట్ ను మాత్రమే నమ్ముకుంటానన్న నిధి
టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ కి ఈ మధ్య కాలంలో అదృష్టం పెద్దగా కలిసిరావడం లేదు. ‘హరి హర వీరమల్లు’, ‘ది రాజా సాబ్’ లాంటి పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోవడంతో... సోషల్ మీడియాలో నిధిపై కొందరు నెటిజన్లు తీవ్రంగా నెగెటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. కేవలం టాలెంట్ ఉంటే సరిపోదని, ఇండస్ట్రీలో రాణించడానికి అదృష్టం కూడా ఉండాలంటూ విమర్శిస్తూ.. ఆమెను 'ఐరన్ లెగ్' అంటూ దారుణంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.
ఈ ట్రోల్స్‌పై నిధి అగర్వాల్ స్పందిస్తూ... తాను విమర్శలను పట్టించుకోనని చెప్పింది. పొగడ్తలను కూడా తలకెక్కించుకోనని స్పష్టం చేసింది. విజయవంతమైన నటిగా పేరు తెచ్చుకోవాలని అందరికీ ఉంటుందని... తాను కూడా దానికి మినహాయింపు కాదని తెలిపింది.
సినిమా సక్సెస్ అనేది కేవలం ఒకరిద్దరి మీద కాకుండా చాలా విషయాలపై ఆధారపడి ఉంటుందని ఆమె అభిప్రాయపడింది. తను నటించిన చిత్రాలు కొన్ని హిట్టయినప్పుడు చాలా సంతోషించానని, ఒకవేళ సినిమా ఆడకపోతే దానికి గల కారణాలను తెలుసుకుని, తనను తాను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపింది. తాను 'లక్' కంటే కేవలం తన 'టాలెంట్'ను మాత్రమే నమ్ముకుంటానని తేల్చి చెప్పింది.