నిజం కాబోతున్న ‘రోబో’ సినిమా.. మనుషులపైనే తిరగబడనున్న ఏఐ!

Technology
Advertisement
  • మనుషుల నియంత్రణను ఏఐ దాటొచ్చన్న ఆంథ్రోపిక్‌
  • తమను తామే అభివృద్ధి చేసుకుంటున్న ఏఐ
  • క్లాడ్ సొంతంగానే 80 శాతం కోడింగ్ రాసినట్లు వెల్లడి
  • ఏఐ అభివృద్ధిని తాత్కాలికంగా ఆపాలని ప్రతిపాదన
Advertisement
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘రోబో’ సినిమాలో వశీకరణ్ సృష్టించిన చిట్టి.. తనను తాను అప్‌గ్రేడ్ చేసుకుని, మనుషులపైనే ఎదురుతిరిగి విధ్వంసం సృష్టిస్తుంది. సరిగ్గా అలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమా సీనే ఇప్పుడు నిజం కాబోతోందంటూ ప్రముఖ ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ సంచలన హెచ్చరిక చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత భవిష్యత్తులో మనుషుల నియంత్రణను దాటిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

క్లాడ్ ఏఐ చాట్‌బాట్‌ను రూపొందించిన ఈ సంస్థ.. భవిష్యత్తులో ఏఐ వ్యవస్థలు తమకు తామే మరింత శక్తిమంతమైన కొత్త రూపాలను సృష్టించుకునే స్థాయికి చేరుకుంటున్నాయని తెలిపింది. దీన్నే సాంకేతిక భాషలో ‘రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్’ అని పిలుస్తారు. సినిమాలో చిట్టి రోబో తనలాంటి వందలాది రోబోలను తయారు చేసుకున్నట్లే.. నిజ జీవితంలోనూ ఏఐ మనుషుల ప్రమేయం లేకుండా తన తర్వాతి తరాన్ని సృష్టించుకోగలదని పేర్కొంది.

ప్రస్తుత 2026 మే నెల నాటికే తమ సాఫ్ట్‌వేర్ కోడ్‌ బేస్‌లో ఏకంగా 80 శాతానికి పైగా కోడింగ్‌ను మనుషులు కాకుండా క్లాడ్ ఏఐ మాత్రమే స్వయంగా రాసిందని సంస్థ వెల్లడించింది. ఈ పరిణామం సైన్స్, వైద్య రంగాలకు ఎంతో మేలు చేసినప్పటికీ.. నియంత్రణ కోల్పోతే ఊహించని ముప్పు తెస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వేగవంతమైన మార్పుల నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని ప్రముఖ టెక్నాలజీ సంస్థలు కలిసి ఏఐ అభివృద్ధిని కొన్నాళ్ల పాటు ‘తాత్కాలికంగా నిలిపివేయాలని’ ఆంథ్రోపిక్ ప్రతిపాదించింది.

టెక్నాలజీ కంటే సమాజం, భద్రతా పరిశోధనలు వెనుకబడిపోకుండా ఉండటానికే ఈ విరామం అవసరమని ఆంథ్రోపిక్‌ స్పష్టం చేసింది. అయితే తీవ్రమైన పోటీ ఉన్న ఈ తరుణంలో అన్ని సంస్థలను ఒప్పించి ఏఐ పరిశోధనలను ఆపడం ప్రాక్టికల్‌గా చాలా కష్టమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొందరు మాత్రం ఈ భయాలను కొట్టిపారేస్తున్నారు. సినిమాలో చూపించినట్లు మనుషుల ఉనికికే ముప్పు వస్తే గనుక మనుషులు ఎప్పుడైనా ఏఐ ప్లగ్‌ను లాగేసి దాన్ని ఆపొచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

AnthropicClaude AIArtificial IntelligenceRobo movie RajinikanthAI safety warningRecursive self improvementAI taking over humansFuture of AI technologyAI development pauseChitti robot real life

More Telugu News

హైదరాబాద్‌లో అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 20:59

'అర్నబ్' తుపానుతో పోలిస్తే 'మురసు' తీవ్రత తక్కువే.. అయినా అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

02 Nov, 20:47

తుపాను ప్రభావిత ఏపీకి కర్ణాటక సాయం.. రంగంలోకి 500 మంది సిబ్బంది

02 Nov, 20:35

'రుద్రవనం పీఎస్' (జీ 5) సిరీస్ రివ్యూ!

02 Nov, 20:15

ఏపీ పుర పోరు: ముగిసిన రీపోలింగ్.. రేపు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

02 Nov, 20:08

'ఓ మైసా రే'.. రష్మిక 'మైసా' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

02 Nov, 19:52

కుల్దీప్ ను సిరీస్ మొత్తం పక్కనబెట్టడం ఆశ్చర్యంగా ఉంది: వెంకటపతిరాజు

02 Nov, 19:37

దేశంలో పెరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటున్న పైలట్ల సమాఖ్య

02 Nov, 19:24

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌: భారత-ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. జట్టులో హేమాహేమీలకు చోటు!

02 Nov, 19:01

ఏపీ తీరం వైపు 'మురసు'.. పోర్టుల్లో పెను ప్రమాద హెచ్చరికలు.. దక్షిణ కోస్తాలో రెడ్ అలర్ట్

02 Nov, 18:24

'మురసు' తుపాను ప్రభావం: తిరుమలలో భక్తుల కోసం టీటీడీ ముందస్తు చర్యలు

02 Nov, 18:08

ఏపీ రెండు రకాల వైపరీత్యాలతో సతమతమవుతోంది.. తక్షణమే సాయం అందించండి: కేంద్రబృందంతో చంద్రబాబు

02 Nov, 17:57

2008 నాటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు ఐపీఎల్ క్యాలెండర్ మార్చాలి: లలిత్ మోదీ

02 Nov, 17:43

తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి: అమిత్‌ షా

02 Nov, 17:32

త్రివర్ణ పతాకం చేతబూని హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర.. కదంతొక్కిన కాషాయ శ్రేణులు

02 Nov, 17:30
..More Telugu News