బాలకృష్ణ ‘NBK111’ నుంచి జూన్ 10న కీలక అప్‌డేట్!
- బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం
- బాలకృష్ణ సరసన నటిస్తున్న కాజల్ అగర్వాల్
- పవర్‌ఫుల్, స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేసిన టీమ్
నటసింహం బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘NBK111’ (వర్కింగ్ టైటిల్) సినిమాకు సంబంధించి ఒక అప్‌డేట్ వచ్చింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వృద్ధి సినిమాస్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా యూనిట్ ఒక పవర్‌ఫుల్, స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ చూసిన తర్వాత అటు నందమూరి అభిమానుల్లో, ఇటు సోషల్ మీడియాలో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.
ఈ పోస్టర్‌లో “No More Vintage.. Only New Age” (ఇక పాత పద్ధతి లేదు.. కేవలం కొత్త శకం మాత్రమే) అనే ట్యాగ్‌లైన్‌ను హైలైట్ చేశారు. అంటే బాలయ్యను మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ స్టైలిష్ లుక్‌లో గోపీచంద్ మలినేని చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది.
జూన్ 10న బిగ్ సర్ప్రైజ్?
ఈ సరికొత్త పోస్టర్‌లో జూన్ 10 తేదీని చాలా ప్రత్యేకంగా హైలైట్ చేశారు. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం.. ఈ జూన్ 10న చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్, ఫస్ట్ లుక్ లేదా ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక పాన్-ఇండియా రేంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రొమోషన్ల స్ట్రాటజీ చూస్తుంటే... బాక్సాఫీస్ వద్ద ఈసారి బాలయ్య సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.