క్రికెట్ పిచ్ వదిలి ఈటె పట్టాడు.. రోమ్ డైమండ్ లీగ్‌లో 92.62 మీటర్ల త్రోతో లంక కుర్రాడి విశ్వరూపం!

Sports
Advertisement
  • రోమ్ డైమండ్ లీగ్‌లో సత్తా చాటిన శ్రీలంక అథ్లెట్ రుమేష్
  • 92.62 మీటర్లు విసిరి స్వర్ణం.. 20 ఏళ్ల మీట్ రికార్డు బద్ధలు
  • భారత స్టార్ నీరజ్ చోప్రా కెరీర్ బెస్ట్‌ను అధిగమించిన రుమేష్
  • క్రికెట్‌ను వీడి జావెలిన్ త్రోలో అద్భుతాలు సృష్టిస్తున్న యువ కెరటం
  • ఆసియా రికార్డుకు కేవలం 35 సెంటీమీటర్ల దూరంలో లంక సంచలనం
Advertisement
ఒకప్పుడు క్రికెట్ పిచ్‌పై గంటకు 134 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించిన లంక ఫాస్ట్ బౌలర్.. ఇప్పుడు అథ్లెటిక్స్ ట్రాక్ పై ఈటెను (Javelin) రాకెట్‌ వేగంతో విసురుతూ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇటలీ రాజధాని రోమ్‌లోని ప్రతిష్ఠాత్మక స్టాడియో ఒలింపికో వేదికగా జరిగిన 'రోమ్ డైమండ్ లీగ్ 2026' (Rome Diamond League)లో శ్రీలంకకు చెందిన 23 ఏళ్ల జావెలిన్ త్రోయర్ రుమేష్ తరంగ పతిరాగే సంచలన ప్రదర్శన చేశాడు. గురువారం రాత్రి జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో తన కెరీర్ బెస్ట్ అయిన 92.62 మీటర్ల దూరం ఈటెను విసిరి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ అద్భుతమైన త్రోతో ఈ 2026 సీజన్‌లో ప్రపంచంలోనే అత్యంత సుదూర మార్కును (World Lead) తాకిన మొదటి అథ్లెట్‌గా రుమేష్ రికార్డు సృష్టించాడు.

రెండో ప్రయత్నంలోనే రుమేష్ ఈ అసాధారణ మైలురాయిని చేరుకున్నాడు. అతని కంటే దాదాపు 10 మీటర్ల వెనుకబడిన మాజీ ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనడా-83.91 మీ) రజతం గెలవగా, అమెరికాకు చెందిన కర్టిస్ థాంప్సన్ కాంస్యం దక్కించుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో నార్వే దిగ్గజం ఆండ్రియాస్ థోర్కిల్డ్‌సెన్ పేరిట 2006 నుంచి ఉన్న 20 ఏళ్ల నాటి రోమ్ మీట్ రికార్డును (90.34 మీ) రుమేష్ ఏకంగా రెండు మీటర్ల తేడాతో బద్దలు కొట్టాడు. ఇది సరికొత్త శ్రీలంక జాతీయ రికార్డు కావడం విశేషం.

ఆసియా జావెలిన్ చరిత్రలో సరికొత్త సంచలనం
ఈ అద్భుత విజయంతో ప్రపంచ జావెలిన్ హిస్టరీలో 90 మీటర్ల మార్కును దాటిన ఎలైట్ క్లబ్‌లో రుమేష్ చేరిపోయాడు. ఆసియా ఖండం నుంచి ఈ ఘనత సాధించిన కేవలం నాలుగో అథ్లెట్‌గా నిలిచాడు. ఇంతకుముందు భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా (90.23 మీ), పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ (92.97 మీ), చైనీస్ తైపీకి చెందిన చెంగ్ చావో-సున్ (91.36 మీ)లు మాత్రమే ఈ మైలురాయిని దాటారు. ఇప్పుడు రుమేష్ ఏకంగా 92.62 మీటర్లు విసిరి, భారతదేశ స్టార్ నీరజ్ చోప్రా కెరీర్ బెస్ట్ రికార్డును అధిగమించాడు. అంతేకాదు, పారిస్ ఒలింపిక్స్‌లో పాక్ స్టార్ అర్షద్ నదీమ్ నెలకొల్పిన ఆసియా రికార్డుకు (92.97 మీ) కేవలం 35 సెంటీమీటర్ల దూరంలో రుమేష్ నిలిచాడు.

క్రికెట్ డ్రాపౌట్ టు హిస్టరీ మేకర్
లంకలోని కలుతర ప్రాంతానికి చెందిన రుమేష్ చిన్నతనంలో క్రికెట్‌ను అమితంగా ప్రేమించాడు. సెయింట్ పీటర్స్ కాలేజీ తరఫున ఆడుతూ ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి.. హాఫ్ సెంచరీ చేసిన రికార్డు కూడా ఉంది. అయితే, క్రికెట్‌లో ఉండే విపరీతమైన పోటీ, రాజకీయాల కారణంగా 2017లో తన తండ్రి (మాజీ డిస్కస్ త్రో అథ్లెట్) ప్రోత్సాహంతో జావెలిన్ వైపు అడుగులు వేశాడు. మొదట్లో 30 మీటర్లు మాత్రమే విసిరిన రుమేష్.. కోచ్ టోనీ ప్రసన్న మార్గదర్శకత్వంలో కఠినమైన శిక్షణ తీసుకుని ఈ స్థాయికి ఎదిగాడు. గత ఏడాది టోక్యో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 6వ స్థానంలో నిలిచిన అతడు, ఈ ఏడాది మార్చిలోనే 89.37 మీటర్లతో ఫామ్‌లోకి వచ్చాడు. నీరజ్ చోప్రాను తన రోల్ మోడల్‌గా భావించే రుమేష్, రాబోయే ఆసియా క్రీడల్లో నీరజ్, అర్షద్ నదీమ్‌లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. 
Advertisement

సంబంధిత వార్తలు

Rumesh Tharanga PathirageRome Diamond League 2026Javelin Throw World LeadSri Lanka Javelin National RecordNeeraj ChopraArshad NadeemJavelin Throw 92.62mStadio Olimpico RomeAsian Javelin ThrowersCricketer turned athlete

More Telugu News

అమిత్ షాతో భేటీపై సోషల్ మీడియాలో స్పందించిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 21:52

ఆరేళ్లలో అతిపెద్ద జంప్.. మళ్లీ భారత నెం.1 కుబేరుడిగా ముకేశ్ అంబానీ

02 Nov, 21:39

మనకు ఇష్టమైన గోరింక పిట్ట ఆస్ట్రేలియన్లకు ఎందుకు నచ్చదు?

02 Nov, 21:19

హైదరాబాద్‌లో అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 20:59

'అర్నబ్' తుపానుతో పోలిస్తే 'మురసు' తీవ్రత తక్కువే.. అయినా అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

02 Nov, 20:47

తుపాను ప్రభావిత ఏపీకి కర్ణాటక సాయం.. రంగంలోకి 500 మంది సిబ్బంది

02 Nov, 20:35

'రుద్రవనం పీఎస్' (జీ 5) సిరీస్ రివ్యూ!

02 Nov, 20:15

ఏపీ పుర పోరు: ముగిసిన రీపోలింగ్.. రేపు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

02 Nov, 20:08

'ఓ మైసా రే'.. రష్మిక 'మైసా' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

02 Nov, 19:52

కుల్దీప్ ను సిరీస్ మొత్తం పక్కనబెట్టడం ఆశ్చర్యంగా ఉంది: వెంకటపతిరాజు

02 Nov, 19:37

దేశంలో పెరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటున్న పైలట్ల సమాఖ్య

02 Nov, 19:24

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌: భారత-ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. జట్టులో హేమాహేమీలకు చోటు!

02 Nov, 19:01

ఏపీ తీరం వైపు 'మురసు'.. పోర్టుల్లో పెను ప్రమాద హెచ్చరికలు.. దక్షిణ కోస్తాలో రెడ్ అలర్ట్

02 Nov, 18:24

'మురసు' తుపాను ప్రభావం: తిరుమలలో భక్తుల కోసం టీటీడీ ముందస్తు చర్యలు

02 Nov, 18:08

ఏపీ రెండు రకాల వైపరీత్యాలతో సతమతమవుతోంది.. తక్షణమే సాయం అందించండి: కేంద్రబృందంతో చంద్రబాబు

02 Nov, 17:57
..More Telugu News