అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శ్రీకర్ భరత్

Sports
Advertisement
  • భారత్ తరఫున ఏడు టెస్టు మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం
  • దేశం కోసం ఆడటం గొప్ప గౌరవమని భావోద్వేగ పోస్ట్
  • విశాఖపట్నానికి చెందిన 32 ఏళ్ల భరత్ ఈ నిర్ణయం
  • రంజీల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు
Advertisement
టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్, ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ (కేఎస్ భరత్) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 32 ఏళ్ల భరత్, గురువారం సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు.

"దేశం తరఫున ఆడటం నా జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవం. ఎంతో గర్వంగా, కృతజ్ఞతాభావంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నాను" అని భరత్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. గత 20 ఏళ్లుగా తన కలను నిజం చేసేందుకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా భరత్ ధన్యవాదాలు తెలిపాడు.

రిషభ్ పంత్ గాయపడటంతో 2023 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన నాగ్‌పూర్ టెస్టులో భరత్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో మొత్తం ఏడు టెస్టులు ఆడిన ఈ ఆంధ్రా ఆటగాడు... 20.09 సగటుతో 221 పరుగులు చేశాడు. ఇందులో 44 పరుగులే అత్యధిక స్కోరు. 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ ఆడాడు. 2024 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో తన సొంతగడ్డ విశాఖపట్నంలోనే చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.

ఐపీఎల్ ప్రయాణాన్ని పరిశీలిస్తే.. 2015 వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ భరత్‌ను రూ.10 లక్షలకు దక్కించుకుంది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

విశాఖపట్నంలో జన్మించిన భరత్, దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్ర జట్టు తరఫున కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2015లో రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. 2005లో ధోనీ 148 పరుగులు చేసిన విశాఖ వన్డేలో భరత్ బాల్ బాయ్‌గా వ్యవహరించడం ఒక మధుర జ్ఞాపకం. జాతీయ జట్టులో స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొనడంతో భరత్‌కు పరిమిత అవకాశాలే లభించాయి.
Advertisement

సంబంధిత వార్తలు

KS BharatSrikar BharatIndian CricketInternational RetirementAndhra Pradesh CricketTest Cricket

More Telugu News

అమిత్ షాతో భేటీపై సోషల్ మీడియాలో స్పందించిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 21:52

ఆరేళ్లలో అతిపెద్ద జంప్.. మళ్లీ భారత నెం.1 కుబేరుడిగా ముకేశ్ అంబానీ

02 Nov, 21:39

మనకు ఇష్టమైన గోరింక పిట్ట ఆస్ట్రేలియన్లకు ఎందుకు నచ్చదు?

02 Nov, 21:19

హైదరాబాద్‌లో అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 20:59

'అర్నబ్' తుపానుతో పోలిస్తే 'మురసు' తీవ్రత తక్కువే.. అయినా అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

02 Nov, 20:47

తుపాను ప్రభావిత ఏపీకి కర్ణాటక సాయం.. రంగంలోకి 500 మంది సిబ్బంది

02 Nov, 20:35

'రుద్రవనం పీఎస్' (జీ 5) సిరీస్ రివ్యూ!

02 Nov, 20:15

ఏపీ పుర పోరు: ముగిసిన రీపోలింగ్.. రేపు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

02 Nov, 20:08

'ఓ మైసా రే'.. రష్మిక 'మైసా' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

02 Nov, 19:52

కుల్దీప్ ను సిరీస్ మొత్తం పక్కనబెట్టడం ఆశ్చర్యంగా ఉంది: వెంకటపతిరాజు

02 Nov, 19:37

దేశంలో పెరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటున్న పైలట్ల సమాఖ్య

02 Nov, 19:24

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌: భారత-ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. జట్టులో హేమాహేమీలకు చోటు!

02 Nov, 19:01

ఏపీ తీరం వైపు 'మురసు'.. పోర్టుల్లో పెను ప్రమాద హెచ్చరికలు.. దక్షిణ కోస్తాలో రెడ్ అలర్ట్

02 Nov, 18:24

'మురసు' తుపాను ప్రభావం: తిరుమలలో భక్తుల కోసం టీటీడీ ముందస్తు చర్యలు

02 Nov, 18:08

ఏపీ రెండు రకాల వైపరీత్యాలతో సతమతమవుతోంది.. తక్షణమే సాయం అందించండి: కేంద్రబృందంతో చంద్రబాబు

02 Nov, 17:57
..More Telugu News