తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
- తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
- లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్తంభించిన జనజీవనం
- కరీంనగర్, సిద్దిపేట, జనగామ, ములుగు జిల్లాల్లో వర్ష ప్రభావం
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్, కరీంనగర్ పట్టణం, హుజూరాబాద్, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలతో పాటు ములుగు జిల్లాలోని మల్లంపల్లి, వెంకటాపూర్, ములుగు మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల రోడ్లు వాగులను తలపించడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.