పవన్‌ సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు?: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు

Telangana
Advertisement
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా
  • ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని వ్యాఖ్య
  • రాజకీయ పరిస్థితులను బట్టి తెలంగాణలో పొత్తు ఉంటుందని వివరణ
  • జనసేనతో పొత్తుపై హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
Advertisement
తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జనసేన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలను ప్రజలు పూర్తిగా తిరస్కరించే పరిస్థితి వచ్చిందని  అన్నారు. అందుకే తమ ఉనికిని కాపాడుకోవడానికే మళ్లీ ప్రాంతీయ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నాయని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎంతో బీఆర్ఎస్ కలిసి పనిచేయలేదా? అని ఆయన నిలదీశారు. అది తెలంగాణ వ్యతిరేక శక్తులతో పనిచేసినట్లు అవ్వదా? అంటూ ప్రశ్నించారు.

రాజకీయ పరిస్థితులను బట్టి తెలంగాణలో పొత్తుపై ముందుకెళ్తామని రామచందర్ రావు స్పష్టం చేశారు. జనసేనతో పొత్తుపై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
Advertisement

సంబంధిత వార్తలు

BJPPawan KalyanTelanganaRamchander Rao

More Telugu News

అమిత్ షాతో భేటీపై సోషల్ మీడియాలో స్పందించిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 21:52

ఆరేళ్లలో అతిపెద్ద జంప్.. మళ్లీ భారత నెం.1 కుబేరుడిగా ముకేశ్ అంబానీ

02 Nov, 21:39

మనకు ఇష్టమైన గోరింక పిట్ట ఆస్ట్రేలియన్లకు ఎందుకు నచ్చదు?

02 Nov, 21:19

హైదరాబాద్‌లో అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 20:59

'అర్నబ్' తుపానుతో పోలిస్తే 'మురసు' తీవ్రత తక్కువే.. అయినా అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

02 Nov, 20:47

తుపాను ప్రభావిత ఏపీకి కర్ణాటక సాయం.. రంగంలోకి 500 మంది సిబ్బంది

02 Nov, 20:35

'రుద్రవనం పీఎస్' (జీ 5) సిరీస్ రివ్యూ!

02 Nov, 20:15

ఏపీ పుర పోరు: ముగిసిన రీపోలింగ్.. రేపు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

02 Nov, 20:08

'ఓ మైసా రే'.. రష్మిక 'మైసా' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

02 Nov, 19:52

కుల్దీప్ ను సిరీస్ మొత్తం పక్కనబెట్టడం ఆశ్చర్యంగా ఉంది: వెంకటపతిరాజు

02 Nov, 19:37

దేశంలో పెరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటున్న పైలట్ల సమాఖ్య

02 Nov, 19:24

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌: భారత-ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. జట్టులో హేమాహేమీలకు చోటు!

02 Nov, 19:01

ఏపీ తీరం వైపు 'మురసు'.. పోర్టుల్లో పెను ప్రమాద హెచ్చరికలు.. దక్షిణ కోస్తాలో రెడ్ అలర్ట్

02 Nov, 18:24

'మురసు' తుపాను ప్రభావం: తిరుమలలో భక్తుల కోసం టీటీడీ ముందస్తు చర్యలు

02 Nov, 18:08

ఏపీ రెండు రకాల వైపరీత్యాలతో సతమతమవుతోంది.. తక్షణమే సాయం అందించండి: కేంద్రబృందంతో చంద్రబాబు

02 Nov, 17:57
..More Telugu News