2 కోట్ల కోసం తల్లిదండ్రులు, సోదరిని చంపిన కొడుకు.. వాటా గొడవలో అతడిని చంపేసిన ఫ్రెండ్!

Greed and Betrayal in Prayagraj Disowned Son Plots Familys Murder for 2 Crore Loot Gets Killed by Friend
  • ప్రయాగ్‌రాజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య
  •  ఆస్తి తగాదాలతో స్నేహితుడితో కలిసి కుటుంబాన్ని అంతమొందించిన కొడుకు అభిషేక్
  • హత్యానంతరం నగలు, నగదు పంపకాల్లో స్నేహితుడితో వివాదం
  • అభిషేక్‌ను ఇనుప రాడ్డుతో కొట్టి చంపేసి, లూటీ మొత్తంతో పరారైన సమోసా వ్యాపారి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో వెలుగుచూసిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి సామూహిక హత్యల (Family Massacre) వెనుక ఉన్న నమ్మకద్రోహం, అత్యాశ, నెత్తుటి కథను పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను, తోబుట్టువును దారుణంగా చంపించిన కొడుకు.. చివరకు ఆ లూటీ చేసిన సొమ్ము పంపకాల్లో వచ్చిన తేడాతో తన స్నేహితుడి చేతిలోనే ఘోరంగా హత్యకు గురయ్యాడు. ప్రయాగ్‌రాజ్‌లోని సౌత్ మలకా ప్రాంతంలో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు శవాలుగా కనిపించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇళ్ల నుంచి దట్టమైన దుర్వాసన రావడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. 24 గంటల్లోనే ఈ మిస్టరీని ఛేదించారు.

పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. వీరేంద్ర వైశ్య (70), ఆయన భార్య అనితా వైశ్య (65), కుమార్తె మీనాక్షి (40)ల మృతదేహాలు వారి ఇంట్లో లభ్యం కాగా.. వీరేంద్ర కుమారుడైన అభిషేక్ వైశ్య (38) మృతదేహం సమీపంలో తాళం వేసి ఉన్న అతడి దుకాణంలో దొరికింది. గత కొంతకాలంగా ఆస్తి తగాదాల కారణంగా తండ్రి వీరేంద్ర తన కొడుకు అభిషేక్‌ను దూరంగా ఉంచడమే కాకుండా, ఇంట్లో నుంచి కూడా వెళ్లగొట్టాడు. దీంతో కక్ష పెంచుకున్న అభిషేక్.. ఇంట్లో ఉన్న దాదాపు రూ. 2 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలను లూటీ చేయడంతో పాటు, తన కుటుంబం మొత్తాన్ని వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం స్థానికంగా సమోసాలు అమ్ముకునే తన స్నేహితుడు సన్నీ గుప్తా (35) తో కలిసి మే 31న ఈ ఘోరానికి ఒడిగట్టాడు.

హత్యలు చేయడానికి ముందు ఇద్దరూ కలిసి అభిషేక్ దుకాణంలో మద్యం తాగి, భోజనం చేశారు. ఆ తర్వాత సాయంత్రం వేళ ఇంట్లోకి చొరబడి ముగ్గురిని దారుణంగా అంతమొందించారు. అనుకున్నట్లే ఇల్లు లూటీ చేసి పెద్ద మొత్తంలో బంగారం, నగదుతో బయటపడ్డారు. అయితే, దుకాణానికి వచ్చిన తర్వాత మిగిలిన విలువైన వస్తువుల వాటాల పంపకాల్లో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ కోపంలో సన్నీ గుప్తా ఒక ఇనుప రాడ్డుతో అభిషేక్ తలపై బలంగా కొట్టి, అతడిని అక్కడే చంపేసి దుకాణానికి తాళం వేసి పారిపోయాడు.

ఈ దారుణ హత్యలపై దర్యాప్తు చేపట్టిన ప్రయాగ్‌రాజ్ సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) మనీష్ శాండిల్య నేతృత్వంలోని బృందం.. బుధవారం నిందితుడైన సన్నీ గుప్తాను అరెస్ట్ చేసింది. అతడి నుంచి లూటీ చేసిన భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను, నగదును రికవరీ చేశారు. కేవలం డబ్బు, ఆస్తిపై ఉన్న మితిమీరిన వ్యామోహం.. కన్నవారిని చంపేలా చేసి, చివరకు నమ్ముకున్న స్నేహితుడి చేతిలోనే ప్రాణాలు పోయేలా చేసిందని, ఈ ఘోర కలి సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పోలీసులు పేర్కొన్నారు.
Go Back to Shorts
Prayagraj Family Massacre
Abhishek Vaishya Murder Case
Sunny Gupta Arrest Prayagraj
Property Dispute Triple Murder UP
Loot Division Dispute Murder

More Telugu News