జర్మనీలో ఉద్యోగం పోయింది.. స్వదేశంలో నెలకు రూ.9.5 లక్షలు సంపాదిస్తున్నాడు!
- జాతి వివక్షతో ఉద్యోగం కోల్పోయిన అనుల్ అగర్వాల్
- స్వదేశానికి తిరిగొచ్చి గేమ్స్, యాప్స్ అభివృద్ధి చేసిన అనుల్
- సోషల్ మీడియాలో తన పనిపై పోస్ట్‌లు
- ఫ్రీలాన్స్ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న టెక్కీ
ఉద్యోగం కోల్పోవడం ఎవరికైనా పెద్ద ఎదురుదెబ్బ. ముఖ్యంగా విదేశాల్లో జాబ్ పోతే ఆ బాధ వర్ణనాతీతం. కానీ, ముంబైకి చెందిన ఓ గేమ్ డెవలపర్ విషయంలో మాత్రం ఉద్యోగం పోవడం కొత్త విజయానికి నాంది పలికింది. జర్మనీలో ఎదురైన వివక్షను తట్టుకుని, స్వదేశానికి తిరిగొచ్చి సొంతంగా గేమ్స్ క్రియేట్ చేస్తూ ఇప్పుడు నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నాడు.
అనుల్ అగర్వాల్ జర్మనీలో గేమ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసేవాడు. భారత్‌లోని ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన అతడికి ఆ ఉద్యోగం పెద్ద అవకాశం. కానీ, మూడేళ్ల క్రితం కంపెనీ అతణ్ని ఉద్యోగం నుంచి తీసేసింది. ఆఫీసులోని అంతర్గత లోపాలు, జాతి వివక్ష వల్లే తన ఉద్యోగం ఊడిందని అనుల్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.
ఉద్యోగం పోయిన తర్వాత అనుల్ అధైర్యపడలేదు. భారతదేశానికి తిరిగొచ్చి సొంతంగా మొబైల్ యాప్స్, గేమ్స్ తయారు చేయడం ప్రారంభించాడు. అతడు పడిన శ్రమకు ఇప్పుడు అద్భుతమైన ఫలితం దక్కింది. ప్రస్తుతం అనుల్ తన యాప్స్, గేమ్స్ ద్వారా నెలకు దాదాపు రూ.9.5 లక్షల లాభాన్ని ఆర్జిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
తాను చేసే పనులను, గేమ్స్ తయారీ విధానాన్ని అనుల్ మొదటి నుంచి సోషల్ మీడియాలో అందరితో పంచుకునేవాడు. దీనివల్ల అతడికి లింక్డిన్ ద్వారా మంచి కంపెనీలతో కలిసి పనిచేసే ఫ్రీలాన్స్ అవకాశాలు వచ్చాయి. గత ఆరు నెలలుగా ‘ఎక్స్’లో యాక్టివ్‌గా ఉంటూ కేవలం ఆ ప్లాట్‌ఫామ్ ద్వారానే దాదాపు రూ.4.7 లక్షలు సంపాదించాడు.
అనుల్ తయారు చేసిన వివిధ వెబ్, మొబైల్ గేమ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడు కోట్ల మందికి పైగా ఆటగాళ్లు ఆడారు. ఈ ఏడాది మరికొన్ని గేమ్స్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. అనుల్ రాసిన ఈ సక్సెస్ స్టోరీ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కష్ట కాలంలో వెనకడుగు వేయకుండా నిలబడటాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.